Sunday, 18 December 2016

గుడిమెట్ట నగరం – చాగివారు.(1)



రెండవ ప్రకరణం

    గుడిమెట్ట నగరం – చాగివారు.(1)
                

                          గుడిమెట్ట రాజ్యం ప్రాచీనాంధ్ర సామంత రాజ్యాల్లో ఒకటి. కులోత్తుంగ రాజేంద్రచోడుని యాదరణ కు పాత్రుడై , సామంత రాజ్యచిహ్నాలైన భేరీ ,భాక శంఖ , ఆనక ,కాహళమనే పంచ మహా శబ్దాలను, అరయతా పట్టకాన్ని ,బంగారు పల్లకిని ,పూర్ణేందు కిరణ శోభిత చామరాన్ని , హేమదండమును  పొందిన ముప్పభూపాలుడు చాగి వంశం  మూలపురుషుడు. కళింగ యుద్దానంతరం రాజేంద్ర చోడుని చే ప్రకటించబడిన సామంతరాజ్యాలలో ఈ గుడిమెట్ట ఒకటి. కులోత్తుంగునిచే మండలేశ్వరుడు గా గౌరవించబడిన ముప్పభూపాలడు నతవాడి సీమలో గుడిమెట్ట రాజ్యాన్ని స్ధాపించాడు.  దుర్జయ వంశీయులు గా చెప్పుకుంటున్న  చాగి వారు సూర్యవంశ క్షత్రియులమని ప్రకటించుకున్నారు.  వీరు గుడిమెట్ట , విజయవాటిక , ప్రధాన నగరాలు గా చేసుకొని రాజ్యపాలన కొనసాగించారు.
                 
                                  నేడు     గుడిమెట్ట మండల కేంద్రమైన నందిగామ కు పడమర గా 12 కిలోమాటర్ల దూరం లో  ఉన్న ఒక చిన్న గ్రామం. కృష్ణాజిల్లా లో చివరి గ్రామమిది.  కృష్ణానది దాటితే ఆవలి వైపు  గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తాము. కృష్ణానది ఒడ్డున ఎత్తైన పర్వతసానువులచే ఆక్రమించబడి , నల్గొండ నుండి విజయవాడ వరకు  పరిఢవిల్లిన ప్రదేశం లో  కృష్ణానది ఉత్తరతీరం లో ఈ నగరం ఆనాడు నిర్మిత మైంది. ఇచ్చట రెండువైపుల ఒరుసుకొని నిలిచిన పర్వతాలు కృష్ణానది యొక్క లోతు ను పెంచాయి. మండు వేసవి లో కూడ ముఫై అడుగుల లోతు కు మించి ఉండే  నది లోతు నౌకాయానానికి , జలమార్గ రవాణాకు  మంచి సౌకర్యాన్ని కల్గించింది. కృష్ణ ఆవలివైపు కోట రాజుల మాండలిక రాజ్యం ధరణికోట రాజధానిగా విలసిల్లుతున్న సమయమది. కోట రాజులు  అమరావతి ని ,కోన హైహయులు పల్నాటిని , కొండపడమటి రాజులుకొన్నాతవాడి ని పాలిస్తున్న రోజుల్లో ముప్పభూపాలుడు కృష్ణ కు ఉత్తరం గా  ఈ గుడిమెట్ట లో సామంతరాజ్యానికి ముగ్గువేసి , నగర నిర్మాణం చేపట్టాడు.
                    
                                                   -12-
               

                        రాజకీయం గా పరిశీలిస్తే ఈ 12 వ శతాబ్దం మతవైషమ్యాలకు , శైవ వైష్ణవ విభేదాలకు  కారణభూతమైంది. అంతేకాకుండా  ప్రాంతం లో జైన ,బౌద్ధ మతాల  ప్రభావం ఇంకా పూర్తిగా మాసిపోలేదు. అడుగడుగునా యుద్దాలు , రక్తపాతాలు  ఆంధ్రావనిని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు బసవేశ్వరుని వీరశైవం జాతిని జాగృతం చేస్తున్న సమయమిది. అమరేశ్వరుని గుడిగంటలు అహర్నిశలు శబ్దిస్తున్న తరుణ మది. ఇటువంటి సమయం లో కొండ మీద  రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ,గుడిమెట్ట నిర్మాణం ప్రారంభించాడు ముప్పభూపాలుడు. ఈతని యనంతరం దోరభూపతి 1 రాజ్యానికి వచ్చాడు. దేశం లో జరుగుతున్న యుద్ధాల్లో ప్రభువులైన పూర్వ చాళుక్యులకు సహాయం చేస్తూనే ,తన కోటను పటిష్టపరుచుకో యత్నించా డీయన. ఆంథ్రరాష్ర్టం లో కాకతీయులు నెమ్మది గా నిలదొక్కుకొని, తన అధికార హస్తాన్ని  ప్రసరింపజేయసాగారు. తిక్కన హరిహరాద్త్వైతం ప్రజల్లో కొత్త ఆలోచనలను  రేకెత్తించసాగింది.  ఈ కాలం లో రాజులు శైవమతానుయాయులైనప్పటికి హరి హరులను ఇరువురుని సమానంగా ఆదరించసాగారు .మొదటి పోతరాజు కాలంలోనే విశ్వేశ్వర దేవరకు ,చోడనారాయణునకు  గుడిమెట్ట లో ఆలయాలు కట్టించాడు.
                                           
                                                   శ్రీకృష్ణ వేణ్ణాతట భూమిభాగే
                                                శ్రీ పోతభూపో గుడిమెట్ట నామ్నీ
                                                 విశ్వేశ్వరాఖ్యం శివమాదిదేవం
                                                   సంస్ధాపయా మాస పురే  (Arc-300/1924 )
              
     --   అని శాసన సాక్ష్యము.
             

                                               



                      త్యాగి పోతరాజు  చాగి వంశం లో ప్రసిద్దుడు.    త్యాగి, చాగి, సాగి పదాలు సమానా ర్ధకాలు గా  కన్పిస్తున్నాయి. చాగి వంశీయులు తాము దుర్జయ వంశీయులమని
చెప్పు కున్నారు.  వీరు చతుర్థాన్వయులు. విప్పర్ల వంశజులైనట్లు శాసనాద్యాధారాలు కన్పిస్తు న్నాయి. ముక్త్యాల శాసనం లో వీరి మూలపురుషుడు దుర్జయుడు గా చెప్పబడ్డాడు. కాని ఈ సమయం లో రాజ్యాలనేలిన అనేకమంది రాజులు  తాము దుర్జయ వంశీకుల మనే ప్రకటిం చుకున్నారు. అంతేకాక సూర్య క్షత్రియులు గా ప్రస్తావించబడ్డారు. ఈ చాగి వంశం లోని వాడైన  - చాగి మన్మగణపతి దేవరాజు  అనుమంచిపల్లి శాసనం లో  క్షత్రియుడు గా ప్రకటించుకున్నాడు. (Arc -283/1924 )
                                            
                                                                     - 13 –
   
    “ ----- బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర విధయా వర్ణాశ్చతుర్ధా క్రమాత్,
                 తత్రాస్తి బాహుజ కులాభరణం తపోభిర్వప్పర్ల  వంశ  ఇతి – ”(Arc-527/1913) . 

అయితే చాగివారు విష్ణు పాద పద్మోద్భవులని వినుకొండ శాసనం చెపుతోంది.
          
                        శ్రీ లక్ష్మీ పతి పాద పద్మ జనితోవర్ణాశ్చతుర్ధా భవ
              తస్మిన్నేతన్మమమ నాయక: సమజని శ్రీ సాగి వంశోద్భవ: ”(Arc-527/1913).
                           
       క్రీ.శ 1088 నాటి నెల్లూరు జిల్లా  ఒంగోలు తాలూకా నన్నూరు సనం లో  చాగి వారు క్షత్రియులు గా ప్రకటించబడ్డారు. రామవిలాస కావ్యకర్త శ్రీ ఏనుగు లక్ష్మణ కవి చాగి వారు సూర్యాన్వయులని వర్ణించారు. మన్మగణపతి దేవరాజు వేయించిన అనుమంచిపల్లి శాసనం లో బాహుజకులాభరణుడి గా చెప్పబడినా , మిగతా చాగి వారి శాసనాలు వేటిలోను క్షత్రియ  ప్రశంస లేదు. దుర్జయ వంశీకులు గానే చెప్పుకున్నారు. పశ్చిమ చాళుక్యలతో పాటు తెలుగు దేశం లో ప్రవేశించిన పల్నాటి  హైహయులలో చాగి వారు కన్పిస్తున్నారు.
                 
              గురజాల త్రిమూర్త్యాలయం లో  చాగి బేతరాజు శాసనం ఒకటి కన్పిస్తోంది. అమరావతి శాసనం లో చాగి పోతరాజు తమ్ముడైన కల్లయ నాయకుడు బ్రహ్మపాదోద్భవమైన దుర్జయ వంశ సంజాతుడగు ముచ్చయ నాయకుని కుమార్తె యైన చెఱువమ్మ ను పరిణయమాడినట్లు చెప్పబడింది. దుర్జయ వంశజుడైన కల్లయ నాయకుడు  దుర్జయవంశజుడైన ముచ్చయ  కుమార్తె ను వివాహమాడటం గమనిస్తే దుర్జయాన్వమనునది ఒక వర్ణము కాని వంసము కాదని స్పష్టమవుతోంది.
                                             -14-
          అయితే చారిత్రక పురుషుడైన  దుర్జయుడొకడు కన్పిస్తున్నాడు. కళింగ ప్రాంతమైన శ్రీకాకుళం , విశాఖపట్టణం గంజాం ప్రాంతాలను ఇతను పాలించాడు.  ఇంపురు శిలాశాసనం ప్రకారం  మూడవ విష్ణుకుండిన మహారాజు  మాధవర్మ ( క్రీ.శ 540-611)  దుర్జయుని ఓడించినట్లు గా తెలుస్తోంది.( మనసంస్కృతి చరిత్ర  137 వ పేజి.) కాకతీయ గణపతిదేవుడు తన గవరపాడు శాసనం లో తమ కాకతీయ కుటుంబీకులకు దుర్జయుని కారమం గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే దుర్జయ వంశమే ఒకటున్నట్లు అర్ధమౌతోంది.
                   
                      ఇదే సమయం లో మరొక్క విషయం కూడ గుర్తు చేసుకోవాలి. ఆచార్య యం.జి రంగా తన కాకతీయ నాయకులు అనే గ్రంథం లో ఇలా వ్రాశారు.  పురోహితులు ఎప్పటికప్పుడు అధికారం లోకి వచ్చిన కుటుంబాలకు క్షత్రియత్వాన్ని అంటగట్టేవారు. పురాణ కాలక్షేపాల ద్వారా వారికి పురాణనాయకుల గోత్రాలను అన్వయింపజేసేవారు. ఆ విధం గా రాష్ట్రకూట ,చాళుక్య, చోళ , కాకతీయ నాయకులు పురాణ క్షత్రియులు గా  పరిగణనలోకి వచ్చారు. తిక్కన సోమయాజి , విద్యారణ్యస్వామి  వంటి బ్రాహ్మణులు వారికి పవిత్ర క్షత్రియార్హత కల్గించారు. ఆ విధం గా ఆనాటి రాజులు పురాణ నాయకులైన రామ , శ్రీకృష్ణ  పాండవ వంశాలకు వారసులు గా చారిత్రక ఆధారాలను సృష్టించుకున్నారు అని ఇదంతా ఆస్ధాన కవుల , పురోహితుల పుణ్యమేనని ప్రకటించారు.
                            
              అయితే చాగి వారి వలే దుర్జయాన్వయులమని చెప్పుకున్నవారు అనేకమంది కన్పిస్తున్నారు. కొండ పడనటి సీమ వారు  దుర్జయులమనే చెప్పుకున్నారు. కాకతీయుల విషయం మనకు తెలిసిందే. వీరి వడ్డమాన శాసనం దుర్జయులనే ప్రకటిస్తోంది. కాని గణపతి దేవుని మోటుపల్లి , పాకాల, కాంచీపురం శాసనాల్లో కాకతీయులు సూర్య వంశీయులు గా స్తుతించబడటం మనం గమనించవచ్చు. కాని కాకతీయుల సామంతుల శాసనాల్ని , వారి సన్నిహిత బాంధవ్యాల్ని పరిశీలిస్తే వీరు చతుర్ధాన్వయులు గానే కన్పిస్తున్నారు. దుర్జయుడైన కాకతి గణపతి దేవ చక్రవర్తి చోళులను జయంచిన పిమ్మట క్షత్రియుడనని ప్రకటంచుకోగా , సమకాలికుడు,ఒకే వంశీయుడునైన మన్మచాగి గణపతి దేవరాజు కూడ తాను క్షత్రియుడనని ప్రకటించుకోవడం లో ఆశ్చర్యం లేదు. అంతేకాదు .ఈ రెండు శాసనాలు ఒకేకాలం లోనివి కావడం మనం గమనించాలి.
              -15 
           
                      చాగివారి అనుమంచిపల్లి  శాసనం క్రీ.శ.1260 (శా.శ.1182.) లోనిది కాగా , కాకతీయుల మల్కాపురం శాసనం క్రీ.శ.1261(శా.శ.1183 .) లోనిది. కాబట్టి వీరు ప్రకటించుకున్న క్షత్రియత్వమనునది ధాత్రీపతిత్వ సంజాతమే కాని జన్మత: చతుర్థాన్వయులేనని లభించిన  శాసనాద్యాధారాలతో అంగీకరించవలసిందే.
                     
        ప్రతాపరుద్రుని ఆస్ధానకవి శ్రీ విద్యానాధుడు ప్రతాపరుద్రచరిత్ర  వ్రాస్తూ అత్యర్కేందు కుల ప్రశస్తి మభిదద్యం కాకతీయాన్వయమ్  టూ సూర్య చంద్ర వంశాల ప్రతిష్ట తలదన్నే ప్రశస్తి కాకతీయకులాని దంటాడు. అంటే పరోక్షంగా కాకతీయులు చతుర్ధాన్వయులని స్పష్టం చేసినట్లే వుతుంది. అంతేకాదు.  తెలంగాణా లేని భూదపుర సాసనం లో కాకతీయుల ను గురించి వ్రాస్తూ  ఇంతక పూర్వం  నాలుగు వర్ణాలుండేవని  , అందులో నాల్గవది జగత్ప్రసిద్దమైన వర్ణమనియు , దానిలో కాకతీయులు  జన్మించిరని వ్రాయబడింది.
                                 
                                        చత్వారో జగతి ఖ్యాతిస్తతో వర్ణ స్సమంతత
                                   ----------------- తేషాం మహా మహీయం
                                   మవాతస్తురయో వర్ణశ్రియం ప్రసవభూమి ----
                                 --------- ప్రశస్తి మస్తి తత్రాపి  కాకతీయ కులం మహత్ 

                 దీన్ని బట్టి క్షత్రియత్వమనేది రాజ్యాధిపత్యం వచ్చేదనే విమర్శకుల వాదన సమంజసమే ననిపిస్తోంది. కాని స్పష్టమైన ఆధారాలు కాదనలేనివి కదా !
                  
            





    కాబట్టి చాగి వారు చతుర్ధాన్వయులు గానే కన్పిస్తున్నారు. కాని కొంతమంది విమర్శకు లు సాగి వారు క్షత్రియులలోను ,చతుర్ధాన్వయుల లోను గలరని వాదిస్తూ అందుకు కావలసిన ఉపపత్తుల్ని , వంశవృక్షాల్ని కూడ ప్రకటించారు. ( భారతి అంగీరస/కార్తిక). కాని
                                                    
                                                            -16-


                          వీరు ప్రకటించిన  వంశవృక్షం లో రెండవ పోతరాజు ,( నరసింహవర్ధన పోతరాజు )  , గణపయ రాజు ,మనుమచాగి గణపతి దేవరాజులు లేరు. కాబట్టి మళ్ళీ ఇక్కడ వేరే ఉపపత్తులు వెతుక్కోవాలి. అందువలన ఒకే ఇంటి పేరున్న వారు రెండు ,మూడు వర్ణాల్లో ఉండటం తెలుగు నేలకు కొత్తేమీ కాదు. రాజులైన వారందరు క్షత్రియులే నంటే వాదమే లేదు. ఈ చర్చ పూర్వ గ్రంథాల్లో ఉండటం వలన ఇక్కడ చేయవలసి వచ్చింది. భావి పరిశోధకులకు అవకాశం ప్పుడూ ఉంటుంది. సాగివారు ,చాగి వారు , త్యాగి వారే నని  , రాజ్యలక్ష్ని ని పొంది రాజులైనారని భావిస్తే  చరిత్ర లో ఆటంకాలు తగ్గుతాయేమో.
                   
                          ముక్త్యాల శాసనాన్ని అనుసరించి చాగి వారి వంశావళి ఈ క్రింది విధం గా ఉంది.
                                              

                                                దుర్జయుడు
                                                        ]
                                             ముప్ప భూపాలుడు
                                                         ] 
                                                   దోరభూపతి 
                                                         ]
                                           పోతరాజు - రాజాంబిక 
                                                        ]
                                               చాగి అను దొర
                                                         ] 
                                            పోతరాజు
           
                    ఇది రెండవ పోతరాజు వేయించిన శాసనము .(Arc-300/1924). ఇటువంటి శాసనమే విజయవాటిక శాసనాల్లో లభిస్తోంది.   దీనిలో కొద్దిగా తేడా కన్పిస్తోంది.
                                                  
                                                       -17-
                                                 
                                                  అరయడు
                                                          ]  
                                                       దోర రాజు 
                                                            ]  
                                                        పోత రాజు 
                                                            ] 
                                                          చాగి రాజు
                                                               ]
                                                  నరసింహవర్ధన పోతరాజు 
         
                దోర భూపతి ఇల్లాలు  చిమ్మాంబిక. వీరికి ఇద్దరు కుమారులు. వారు కల్లయ నాయకుడు. భీమ రాజు.   కల్లయ నాయకుడు దుర్జయ వంశోద్భవుడైన   ముచ్చయ కుమార్తెయైన చెఱువమ్మ ను  పరిణయ మాడాడు. ముచ్చయ ల్లాలు జక్కాంబిక. భీమరాజు కు దోరడు  దోరనికి పోతరాజు అనే కుమారులు కలిగారు. ముక్త్యాల ,(Arc-271/1897) అమరావతి(Arc-294/1892)   , బెజవాడ (Arc-300/1924) శాసనాల్ని సమన్వయం  చేసి కొని చూస్తే చాగి వారి వంశ వృక్షం  ఇలా ఉంటుంది.
                                        

                                    
                                                    -18-                               
                                                  దుర్జయుడు
                                                        |              
                                                 ముప్పరాజు
                                                        |      
                                    దోరభూపతి  -  చిమ్మాంబిక
                                                        |
                  -------------------------------------------
                                  |                                 |                                   |
                           పోతరాజు                      భీమరాజు              కల్లయనాయకుడు   
                                  |                                  |            
                                    

                         
   చాగి                    దోర భూపతి                                               దోర                                                                                                                                                                                             
                                 |                                |   
                  నరసింహవర్థన పోతరాజు           పోత

                     వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్ధాన ప్రాంగణం లో కన్పించే మన్మగణపతి దేవరాజు శాసనాన్ని పరిశీలిస్తే -  దోరమహీపతి కి గణపతి యు, గణపతి కి చాగి మన్మ గణపతి యు కుమారులని తెలుస్తుంది. సౌందర్య నిలయ: త్యాగి మన్మ మహీపతి :” అని మన్మ గణపతి మహారాజు ను సౌందర్య నిలయుడ గా పేర్కొంటుంది ఈ శాసనం. (Arc-309/1924). సామంతరాజులు తమ బిడ్డలకు తమ ప్రభువుల పేర్లు పెట్టుకోవడం  ఈ యుగధర్మం గా కన్పిస్తోంది. కులోత్తుంగ చోడుని పై నున్న గౌరవం తో వెలనాటి గొంకయ తన కుమారునికి రాజేంద్ర చోడుడు అని పేరు పెట్టుకున్నాడు. రెండవ కులోత్తుంగ రాజేంద్ర చోడుడు  గొప్పవీరుడు గా ప్రసిద్దు డయ్యాడు. అలాగే తన కొడుకు కూడ ప్రభువు వలే ఎదగాలనే చిరుకోరిక ఆ తండ్రి గుండెల్లో ఉండి ఉంటుంది. అందుకే గణపతి దేవరాజు  , మనుమ గణపతి దేవరాజు పేర్లు కాకతీయుల ప్రభావం తో చాగి వంశం లో చోటుచేసుకున్నాయి. తమ ఇష్ట దైవాల పేర్లను , మహా నాయకుల పేర్లను తమ బిడ్డలకు పెట్టుకోవడం తెలుగు నాట ఇప్పటికీ కన్పిస్తూనే ఉంది.
                        
                                                            -19-
                   
                             అనుమంచిపల్లి శాసనం (Arc-283/1924) ఈ విషయాన్ని బలపరుస్తూ-పోతరాజు కు దోరభూపతి ,దోరయ కు ముప్పాంబిక వలన గణపయ రాజు , గణపతి కి పోతరాజు  జన్మించి నట్లు చెప్పబడింది. మునగానపల్లె శాసనం లో చాగిరాజునకు భీమరాజు ,భీమరాజు కు పార్వతీదేవి వలన మనుమచాగిరాజు కుమారులు గా జన్మించి నట్లు చెప్పబడింది. (Arc-259/1924). అలాగే పోతవరం ఫకీరు తక్వా వద్ద నున్న శాసనాన్ని పరిశీలిస్తే పోతరాజు కు ప్రోలమదేవి అను పేరు గల కుమార్తె ఉన్నట్లు, ఆమెను దుర్గరాజు కి ఇచ్చి వివాహం చేసినట్లు మనం గ్రహించవచ్చు. చాగి వారి శాసనాలు చాలభాగం ఛిద్రమైనాయి. అందు వలన ఎంతో విలువైన  సమాచారం జాతికి తెలియకుండానే భూ స్ధాపితం అయిపోయింది.
                                            
                       పైన చూసిన శాసనాద్యాధారాలను సమన్వయం చేస్తే చాగి  వారి వంశానుక్రమణిక ఇలా తయారౌతుంది.
                                                         దుర్జయుడు
                                                              ]
                                                    ముప్పభూపాలుడు
                                                               |
                                            దోరభూపతి -చిమ్మాంబిక
                                                              |       
                        ----------------------------------------     
                         |                                       |                               |
మొదటి పోతరాజు-రాజాంబిక                  భీమ            కల్లయ నాయకుడు-చెఱువమ్మ
                        |                                        |                                                                                                             
                        |                                     దోర
                        |                                       |                               
                        |                                       పోత 
              ---------- ----------------------   
                       |                                                      | 
 ప్రోలయదేవి దుర్గ రాజు                 దోరభూపతి ముప్పాంబిక
|
                                             ----------------------------------------                         
                                             |                                             |                                             |
 నరసింహవర్ధన పోతరాజు ముక్తాంబ      గణపయరాజు తిన్నాంబిక       భీమరాజు -   పార్వతీదేవి  
                                                                             |                                                    |            
                                                      మనుమచాగి గణపతి దేవ                              దోరపరాజు
                                                                           |                                                      |
                                                                  పోతరాజు                                          చాగిరాజు


                                            -20-
         
                     తేదీ లేని పెనుగంచిప్రోలు శాసనం లో భీమరాజు కొడుకు దోరపు రాజు విశ్వేశ్వర దేవరకు హవిర్బిల్వార్చనలకు చేసిన దాన ప్రసక్తిఉంది. అలాగే ముప్పాళ్ళ శాసనం లో శా.శ 1199. (క్రీ.శ.1147.) చాగి మనుమ పోతరాజు బృహత్కాంచీపురాన్ని పాలిస్తున్నట్లు గా చెప్పబడింది.
                       
                 క్రీ.శ1269 లో ( శా.శ 1190.) నాటి రుద్రమదేవి గుడిమెట్ట శాసనం లో రుద్రమదేవి కట్టసాహిణి దాడి గన్నమ నాయకులు గుడిమెట్ట లోని విశ్వేశ్వర దేవరకు బేతవోలు (జగ్గయ్య పేట ) గ్రామాన్ని  దానం చేసినట్లు వ్రాయబడింది.దీన్ని బట్టి గుడిమెట్ట రాజ్యం క్రీ.శ 1268 నాటికిఉచ్ఛస్థితి లో ఉన్నట్టే అంగీకరించాలి. కాకతి రుద్రమదేవి కాలమది. మన్మ చాగి గణపతిదేవరాజు గుడిమెట్ట నేలుతున్న రోజులవి.ఇదే సమయం లో మనమొక విషయం గుర్తుచేసుకోవాలి.
                     

                   కాకతీయుల శాసనాలు గా గుర్తించదగిన మరి రెండ శాసనాలు గుడిమెట్ట శిథిలాల్లో మనకు కన్పిస్తున్నాయి. అనమ్మకొండ” “ హన్మకొండ పురాధీశులు వంటి పదాలు తప్పితే శాసనం లోని మిగిలిన భాగ మంతా  చదవడానికి వీల్లేనంతగా  ముష్కరుల చేత ధ్వంసం చేయబడింది. ఇక్కడ లభించిన శిల్పాల్లో కాకతీయ సంప్రదాయం స్పష్టం గా కన్పిస్తోంది. కాకతీయుల సామంతులు గానే వీరు చాలకాలం కొనసాగారనడానికి  సాక్ష్యాలున్నాయి.రెండవ పోతరాజు కాలం లో గుడిమెట్ట కు రాజధానిగ విజయవాటిక కొనసాగింది. అదే సమయం లో దోర భూపతి రెండవకుమారుడు భీమరాజు పెనుగంచిప్రోలు కు ఏలిక గా ఉన్నాడు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యం లో కొంతభాగాన్ని సోదరుని అధీనం లో ఉంచినట్లు భావించవచ్చు. పెనుగంచి ప్రోలు లో లభించిన ఒక నాగస్ధంభం పై ఒకశాసనం లభించింది. (Arc-279/1924 ) . ఇది మున్న తరంగిణి సమీపం లోని పెనుగంచి ప్రోలు నందు ----------శ్వర మహాదేవరను ప్రతిష్ఠ చేసి భీమరాజు కొడుకు దోరప రాజు హవిర్బిల్వార్చనలకు కంభంపాటి చెఱువు తూర్పున ----------- ఇచ్చిన దానాన్ని  చెపుతోంది.అందువలన గుడిమెట్ట రాజ్యానికి సమాంతరంగా అదే పరిథి లో మరొక ఉపకేంద్రం గా బృహత్కాంచీపురం (పెనుగంచిప్రోలు )  లో చాగిమన్మ పోత ,చాగి మన్మ గణపతి పేర్లమీద శాసనాలు వేయించే అవకాశం ఏర్పడింది. రెండవపోతరాజు రాజ్యానికి రాగానే రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం లో  విజయవాటిక ను రాజధాని గా కొనసాగిస్తూ సోదరుడైన భీమరాజు కు పెనుగంచి ప్రోలును అప్పగించి ఉంటాడు.
                                    

                                                    -21-
                 
                        కోసవీడు శాసనం లో చాగి పోతరాజు ,చాగి గణపతిదేవులు కురుకూరు సోమనాథ దేవరకు, కోసవీడు విశ్వనాథ దేవరకు చేసిన దానసాసనం ఈ వాదన కు బలమిస్తోంది.ఇది క్రీ.శ 1230 లోనిది. అదే సంవత్సరం శా.శ.1152 (క్రీ.శ.1230 ) లో కురుకూరు స్వయంభూదేవరకు తారమ నామ సంవత్సరం వైశాఖ పాడ్యమి నాడు చాగి పోతరాజు , చాగి గణపతిదేవులు దానం చేసిన భాగం కన్పిస్తోంది. ( Arc-275/1924 ). పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ విభజన జరిగింది. నరసింహవర్ధనపోతరాజు కు సంతానం లేకపోవడం వలన  అతని యనంతరం భీమరాజు కుమారులే రాజ్యానికి వచ్చారు.
                                   
       



                             రెండవ పోతరాజు రాజు భార్య ముక్తాంబ యని, ఆమె పేరు మీదే ముక్త్యాల పట్టణ నిర్మాణం జరిగి ఉండవచ్చని , ముక్తేశ్వర దేవరకు  ముక్తాంబకు ఏమైనా సంబంధముందేమో యోచించాలని సందేహించారు కొందరు విమర్శకులు. (భారతి-ఫిబ్రవరి/1933-273 వ . పే ). దోరభూపతి ఇల్లాలు ముప్పాంబిక . ఈమె పేరు మీద ముప్పాళ్ళ గ్రామం నిర్మించబడి ఉండవచ్చు. ముప్పాళ్ళ లో లభించిన శాసనాలు బృహత్కాంచీపురాన్ని ప్రస్తావిస్తున్నాయి. మనుమ పోతరాజు బృహత్కాంచీపురాన్ని పాలిస్తుండగా  అతని మంత్రి, కొమ్మన కుమారుడునైన మాక చమూపతి ఉత్తరాయణ పుణ్యకాలం లో రామేశ్వరు నకు 25 ఆవులను దానం చేసినట్లు శాసనం ఒకటి ముప్పాళ్ల లో లభించింది. (Arc-257/1924).  దీనిలో తేదీ  పురావస్తుశాఖవారి  సేకరణ లో సందేహం గా ఉంది. శా.శ 1169 గా శాసనం ప్రచురించబడింది. ౧ ౧ ౯ ౯ (1199) ఉన్నదాన్ని ౧ ౧ ౬ ౯  (1169 ) గా భావించడం వలన ఈ ప్రమాదం జరిగి ఉండ వచ్చు. ఇది మూడవ పోతరాజు కాలం.


                                                                                 

                                                                                    
                                                                                      ------------     తఱువాయి భాగం త్వరలో





-----------------------------------------------------------------------------------------------

Monday, 12 December 2016

గుడిమెట్ట శిథిలాల్లో తెలుగు సంస్కృతి -1

 గుడిమెట్ట శిథిలాల్లో తెలుగు సంస్కృతి
                
             (TELUGU CULTURE  IN GUDIMETTA RUINS)

            ముందుగా ----ఒక్క మాట
                        
                             కృష్ణాజిల్లా నందిగామ కు 14 కి.మీ దూరం కృష్ణా నది ఒడ్డున లో గుడిమెట్ట అనే ఒక చిన్నఊరు ఉంది. ఆ ఊరు కు ఒక కిలోమీటరు దూరం లో మసీదు దిబ్బ అని పిలువబడే ప్రదేశం లో కొన్ని శిథిలాలు దాని పరిసరాల్లో కొన్ని పాడుపడిన ఆలయాలు ఉన్నాయని  కాలేజీ లోని నా విద్యార్థులు చెపుతుంటే చూద్దామని ఒక పర్యాయం అక్కడకు వెళ్లడం జరిగింది.   నేను చూసిన శిథిలాల్లో హంపీ తర్వాత అంతగా బాథ పడిన ప్రదేశం ఇదే నేమో  ననిపించిది. అసలు ఆ రాజ్యం ఎవరిది. ఆ శిథిలాలు ఏంచెబుతాయి అనే ఉత్సుకత నాలో కలిగింది. ఆ ఆవేశం లో కాండ్రపాడు పంచముఖేశ్వరుని  గూర్చిఒక వ్యాసం వ్రాసి ఆనాడు  సాహితీ పత్రిక గా బాగా  ప్రసిద్థి కెక్కిన భారతి సాహిత్య పత్రిక కు పంపించడంఅది మార్చి  1988 భారతి మాసపత్రిక లో ప్రచురించబడటం జరిగిపోయింది. ఆ ఉత్సాహం తో గుడిమెట్ట శిథిలాల్లో తెలుగు సంస్కృతి (Telugu culture in Gudimetta ruins) ” అనే  పేరు తో  ఒక Minor Research Project  ను ప్రారంభించి, U.G.C. ఆర్థిక సహాయం తో దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఆనాటి మాట .
                        ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి కి చేరువలో  కృష్ణానది కి ఈవల వైపు ఈ గుడిమెట్ట ఉండటం వల్ల ఈ  విశేషాలన్నీ మళ్లీ  ఇప్పడు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది నా  ఈ పరిశోథనా గ్రంథాన్ని వందల కొద్ది ఫోటోస్టాట్ కాపీలు తీసుకొని  పంచుకుంటుంటేమరి కొద్దిమంది మాటి మాటికి  రావడం ఒకటి రెండు కాపీల కోసం ఆ బైండు ని ఫోటోస్టాట్ కోసం వెనక్కి మడిచి విరగ్గొట్టడం  జరిగిపోతోంది. చివరికి ఆ పుస్తకం మూలమే లేకుండా పోతుందేమో ననే భయం పట్టుకొని దాని లోని వ్యాసాలను ఈ బ్లాగు  లో భద్రపరచాలని ఈ ప్రయత్నం ప్రారంభించాను.
                   
         ఆ పుస్తకాన్ని అచ్చొత్తించవచ్చు కదా! అని కొంతమంది అడుగుతున్నారు. కాని రామాయణం లఘుకావ్యాల మీద  పరిశోథన చేసి డాక్టరేట్ పొందిన నా పరిశోథనా  గ్రంథమే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 1996 లో ప్రింటు చేస్తే అమ్ముకున్నవి అంట కట్టినవి పోగా ఇంకా కొన్ని కాపీలు ఇంట్లో బీరువాల్లో నల్లబడిపోతున్నాయి. ఈ రోజుల్లో పుస్తకాలు కొని చదివే వాళ్లు తక్కువ. ఏ ఆథ్యాత్మిక ఉపన్యాసానికో వెళ్లినప్పుడు అక్కడున్న ‘ పెద్దలు అనుకున్నవాళ్లకి  నా రామాయణ పుస్తకాన్ని బహుమతి గా ఇస్తే , కార్యక్రమం అయిపోయిన తర్వాత చివర్లో ఆ  కార్యక్రమ కార్యకర్త ఎవరో ఒకరు వచ్చి మీ పుస్తకాన్ని అక్కడ మర్చిపోయారండీ అని నేను ఆ ‘ పెద్దమనిషి అనుకున్నాయనకు నేనిచ్చిన పుస్తకాన్ని తిరిగి నాకిచ్చిన ఘటనలు కూడ కొన్ని ఉన్నాయి. అందుకని పుస్తకాన్ని ముద్రించి ఇబ్బంది పడటం నా కిష్టం లేదు.
                                   
                        అయితే ఈ మథ్య వేరు వేరు ప్రదేశాలనుండి కొందరు చరిత్ర పరిశోధకులు , సాహిత్య అభిమానులు   ఫోన్లు చేసి ఈ పుస్తకాన్ని గుఱించి అడుగు తూ ఉండటం నేను ఏదో  చెప్పి, తప్పుకోవడం జరుగుతోంది.  ఎందుకో ఒక శుభసమయం లో దీన్ని ప్రత్యేకం గా బ్లాగు లో  పెడితే జిజ్ఞాసువులకు   ఉపయోగపడుతుందని పించింది.  ఆలోచనే  ఈ ప్రయత్నం.      ఇక పుస్తకం లోకి వెడితే అసలు విషయం తెలుస్తుంది కదా.
  
                      ఈ చారిత్రక పరిశోధనా గ్రంథం అయిదు ప్రకరణాలు గా విభజించబడింది. అవసరాన్ని బట్టి   ఛాయాచిత్రాలు , శాసనాలు , జిల్లాల చిత్రపటాలు ఆయాప్రదేశాల్లో ఇవ్వబడ్డాయి. వాటిని కూడ ఈ ప్రయత్నం లో మీకు అందిస్తాను.


                                                                ఇది ముఖపత్రం




విషయసూచిక





మొదటి ప్రకరణం

        మాండలిక రాజ్యాలు  గుడిమెట్ట
             



                                ఆంధ్రదేశం లో  కృష్ణాతీరం లో రాజ్యాన్ని స్థాపించి, చాళుక్య చోళయుగం నుండి కాకతీయ యుగాంతం వరకు  గుడిమెట్ట రాజథాని గా  రాజ్యపాలన సాగించిన రాజవంశం చాగి వారిది. విజయవాటిక , గుడిమెట్ట , బృహత్కాంచీపురం (పెనుగంచిప్రోలు ) ప్రధాన కేంద్రాలుగా వీరి రాజ్యపాలన కొనసాగింది.
                      

                           చాళుక్య చోళ యుగం తెలుగు దేశ చరిత్ర లో అనేక విథాలుగా ప్రత్యేకతలను సంతరించు కున్న కాలం. మధ్యాంధ్రదేశ చరిత్ర లో  ఒక విధం గా దీనిని మాండలికయుగ మని  పిలువవచ్చు. ఈ కాలం లో మాండలిక రాజులు వేరు వేరు ప్రాంతాల్లో చిన్న చిన్న రాజ్యాలు నిర్మించుకొని, కులోత్తుంగ రాజేంద్ర చోడునకు విధేయులై, దైవభక్తి ,ధర్మానురక్తి  కలిగి తెలుగు సంస్కృతిని కాపాడుతూ రాజ్యపాలన చేసిన కాలమిది.
                             

                                    కులోత్తుంగ రాజేంద్ర చోడుని  పరిపాలనా కాలం లో  సముద్ర తీరస్థ వేంగి లో చాళుక్య చోళుల పరిపాలన నిర్నిరోధం గా కొనసాగింది. ఈతని శాసనాలు అనేకం వేంగీ దేశ లో కన్పిస్తున్నాయి. అయితే వ్వన్నీ ఈతని సామంతులు వేయించినవే అవ్వడం గమనార్హం. వీరందరు తమ శాసనాల్లో తమ ప్రభువును , తమ ప్రభువు విజయరాజ్య సంవత్సరాలను పేర్కొన్నారు. గోదావరీ  సంగ్రామ విజయానంతరం ఆంధ్రరాష్ట్రం లో మాండలిక రాజుల అధికారాలు పెరిగాయనే చెప్పాలి. దానికి కులోత్తుంగ చోళుని ఉదారతే ప్రధాన కారణం గా చెప్పవచ్చు. మాండలిక రాజులు ఏటేటా తమకు చెల్లించవలసిన కప్పాన్ని , ఇతర మర్యాదలను సరిగా పాటించు నంత కాలం మాండలికుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాళుక్య చోడులు అనుసరించిన రాజనీతి. అందుకనే మాండలికులు పేరుకు మాత్రమే మాండలికులు కాని అన్నివిదాల సర్వ తంత్ర స్వతంత్రులు గానే  వ్యవరించేవారు. ఇమ్మడి కులోత్తుంగ చోళుడు పశ్చిమ చాళుక్యాధికారం నుండి వేంగిని విడిపించడం లో రెండవ కులోత్తుంగ చోళుడు ప్రదర్శించిన యుద్ధ నైపుణ్యానికి మెచ్చి   మేఘాడంబరయుగ్మ చామర వియచ్చంద్రోదయా దులగు సామంత చిహ్నాలతో వెలనాటి వారికి ఆంధ్రదేశం లో అధికారాల్ని పెంచాడు. వెలనాటి వారికి ఆంధ్రదేశం పై  పూర్తి ఆధిపత్యం లభించింది.
                            
                                                                                 -2-
                                              
                              వేంగీదేశం లో మాండలికరాజ్యాలు ఎన్ని ఉన్నప్పటికి అన్నింటిలోకి ప్రప్రధమంగా   రాజ్యాధికారాన్ని పొంది రాజ్య విస్తృతిలో  ప్రధమ గణ్యమైనది వెలనాటి దుర్జయ వంశము.  అన్ని మాండలిక రాజ్యాల్లోకి తలమానికమైనది వెలనాటి చోడవంశము. వీరు దుర్జయ వంశీయులయ్యు తమ ప్రభువులైన చోడ రాజన్యులపై నున్న గౌరవాదరాలతో తమ సంతానానికి చోడ నామాన్ని గౌరవచిహ్నంగా ధరించి తమ బిడ్డలకు తమ ప్రభువుల పేర్ల ను పెట్టుకొని గర్వం గా పిలుచుకొనే వారు. వెలనాటి కులోత్తుంగ రాజేంద్ర చోడుడు వీరి వంశము లో ప్రసిద్దుడు.
                                               

                                 కృష్ణానది కి దక్షిణం గా ఉన్న ప్రాంతానికి “ వెలనాడు  అనిపేరు. ఇది ఈ నాటి గుంటూరుజిల్లా ప్రాంతం. ఈ వంశానికి మూలపురుషుడు మల్లవర్మ..త్రిలోచన పల్లవ చక్రవర్తి ని సేవించి, షట్సహస్రదేశాధిపత్యాన్ని,పొందిన వీరిని చరిత్రకారులు ఆరువేలనాడు ప్రాంతీయులు గా పిలిచారు. ఆరువేలనియోగులు అనే ఒక శాఖ ఈ నాటికి బ్రాహ్మణుల్లో కన్పిస్తోంది. వారు ఈ ప్రాంతము వారే. ఈ వెలనాటి చోడులలో ప్రసిద్ధుడు గొంకరాజు.   ఈతని కాలం క్రీ.శ 1076-1108. ఇతడు ప్రధమ కులోత్తుంగచోడ చక్రవర్తి వద్ద సేనాథిపతియై,  యాతని విశ్వాసమును చూరగొని, వెలనాటి పై అధికారాన్ని సంపాదించి , ఆనాటినుండి ఆరువేలనాడు ను పాలించసాగెను.  వెలనాటి  వారికి ఇమేమడి కుళోత్తుంగ చోడుని ద్వారా విశేషాధికారాలు సంక్రమించడం, మథ్యాంధ్ర దేశ మాండలికులకు ఆమోద యోగ్యం గా లేకపోవడం  వెలనాటి చోళులు యిరుగు పొరుగున నున్న కోటవారి తోను ,పల్నాటి హైహయుల తోను ,కొండపడమటి వారి తోను సంబంధ బాంధవ్యాలను చక్కజేసుకో సాగినారు.
                           

                           వెలనాటి దుర్జయ వంశీయులలో ప్రధమగణ్యుడు వెలనాటి గొంకరాజు. తడు పూర్వచాళుక్య రాజులను  భక్తి విశ్వాసముల తో కొల్చిన వీరుడు. ఇమ్మడి కులోత్తుంగ చోడుని పరిపాలనా కాలం లో కళింగ దేశము పై రెండు దండయాత్రలు చేశాడు. మొదటి దండయాత్ర కులోత్తుంగుని  26 వ విజయ రాజ్య వత్సరపు శాసనాల్లోను , రెండవది 40 వ  విజయరాజ్య సంవత్సరాల లోను తదనంతరకాలం లోను కన్పిస్తోంది. ఈతని 40 వ విజయరాజ్య సంవత్సరం  క్రీ.శ .1112 (శ.క 1032 ) . వేంగీ రాజకీయ కల్లోలాల కారణంగా కులోత్తుంగ చోళుడు తన 36 వ విజయ రాజ్యసంవత్సరానికి పూర్వమే అనగా  శ.క 1106 కు   పూర్వమే,పూర్వకాలం నుండి పూర్వచాళుక్యులను భక్తివిశ్వాసాలతో సేవించిన కులక్రమాగత సేవక కుటుంబం లోని సమర్ధులగు సేనానులను  కూడగట్టుకోవడానికి , వారు వేంగీ రాజప్రతినిధులకు  బాసటగా ఉండటానికి గాను దూరదృష్టి తో ఆలోచించి, వీరులైన సోనానులు కొందరికి. రాజలాంఛనాలను ఇచ్చి,
                                                                
                                                                                     -3-


            మండలేశ్వరులు గా వారి హోదాను పెంచాడు.  ఆ విధంగా వెలనాటి దుర్జయ వంశం లోని గొంకయ 1106 నాటికే సమధిగత పంచమహాశబ్ద మహా మండలేశ్వరుడై, చాళుక్య రాజ్య సామంతుడి గా కృష్ణ నది దక్షిణప్రాంతాన్ని పాలించసాగాడు.
                        

                                  అయితే కళింగ యుద్ధానంతరం కుళోత్తుంగచోళుడు ఆ విజయానికి కారణమైన అనేకమంది సైన్యాధికారులకు సామంత చిహ్నాల నిచ్చి గౌరవించాడు. అనగా క్రీ.శ 1112 తర్వాత అనేక మాండలిక రాజ్యాలు ఏర్పడ్డాయి. కళింగ యుద్ధ  వృత్తాంతాన్ని కులోత్తుంగ చోడుని ఆస్ధాన కవి యైన జయగొండాక    కళింగత్తు పరణి   అను పేర గ్రంథంగా రచించాడు.  ఈ గ్రంధం ప్రకారం   ఈ                       కళింగ యుద్ధాన్ని అగ్రభాగాన నిలబడి నడిపించిన వాడు  కులోత్తుంగుని మంత్రి దండనాథుడైన కరుణాకర తొండమాను. ఈ తొండమాను కాంచీపురం నుండి బయలుదేరి , దారిలో పాలేరు , పొన్ముఖరి ,(స్వర్ణముఖి ), పెన్న , మున్నేరు , కృష్ణ , గోదావరి , పంప , గౌతమీ నదులను దాటి కళింగము చేరినట్లు  జయగొండాన్ వ్రాశాడు. ఈ విజయానంతరం కోన హైహయులు , గుడిమెట్ట చాగివారు మరికొంతమంది కూడ సామంత చిహ్నాలను పొంది సామంతరాజ్యాలను ఏర్పరచుకున్నారు. క్రీ.శ 1110- 1112  తర్వాత అనగా రెండవ కళింగయుద్ధానంతరం కుళోత్తుంగ రాజేంద్రుని ద్వారా పంచమహాశబ్దాలను పొంది, మండలేశ్వరుడై , చాగి’  రాజ్యాన్ని గుడిమెట్ట లో స్ధాపించాడు ముప్పభూపాలుడు.
                                       

                                పశ్చిమ చాళుక్యుల తోటే ఈ చాగి వారు కూడ ఆంధ్రదేశం లో ప్రవేశించారనడానికి ఆధారాలున్నాయి. మహామండలేశ్వర చాగి బేతరాజు మాధవీ పట్టణం లోని   (గురజాల ) త్రిమూర్త్యాలయానికి భూదానం  చేసినట్లు సౌమ్య వత్సరానికి సరియైన శకవర్షము  1051 ( క్రీ.శ.1129 వ్రాయించిన శాసనమొకటి కన్పిస్తోంది. ఇందులోనే  చాగి వంశీయులు పలనాటి హైహయులకు సామంతులైనట్లు చెప్పబడింది. వీరు భూలోకమల్ల సోమేశ్వర చక్రవర్తి   తమ  ప్రభువైనట్లు  ప్రకటించు కున్నారు.  గుడిమెట్ట శిథిలాలలో  పూర్తి గా అగ్రాహ్యం గా ఉన్న ఒక శాసన స్థంభం పై మల్లవర్మ , త్రిలోచనపల్లవుని పేర్లు కన్పిస్తుండటం తో వీరు పశ్చిమ చాళుక్యులతో సంబంధాలను కల్గి ఉన్నట్లు సందేహించవలసి వస్తోంది. పూర్వచాళుక్య రాజన్యుల సేవించి ,రెండవ కులోత్తుంగ చోడుని కాలం లో రాజ్యార్హత పొందారు చాగివారు. కులోత్తుంగ రాజేంద్రుని ద్వారా ఆంధ్రదేశానికి అధికారులుగా ప్రకటించబడ్డ  వెలనాటి వారికి  సామంతులు గా వీరు రాజేంద్రచోడుని గౌరవించారు. వారి పాలనను అంగీకరించి వారి సామంతుడు గా మొదటి దోరభూపతి చాగి వంశం లో రాజ్యపాలన చేశాడు. ఇందుకు
                                                             
                                                                                 -4-


                   ఉదాహరణ గా   కృష్ణాజిల్లా కొనకంచి లోని హనుదాలయం లో వెలనాటి రాజేంద్రచోడుని శాసనం ఒకవైపు ఉండగా – రెండవ వైపు  త్యాగిపోతరాజు శాసనం  కన్పిస్తోంది.
                                   

                                                  రెండవ కులోత్తుంగచోడుడు రాజ్యానికి రాగానే  అనేకమైన యుద్దాల్లో పాల్గొన వలసి వచ్చింది. వెలనాటి గొంకరాజు మరణించడం తో  పూర్వచాళుక్యులు పిఠాపురం కేంద్రం గా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం చూసిన కోనహైహయులు కూడ స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. వారి ననుసరించి ఉండి పురం రాజదాని గా పరిపాలన సాగిస్తున్న క్షత్రియులు  వెలనాటి చోడులపై తిరుగుబాటు                       ప్రక టించారు. ఈ సమయం లో రెండవ కులోత్తుంగ రాజేంద్రచోడుడు కొలనిపురం పై దాడి చేసి కోన హైహయ రాక్షసభీముని, అతని కుమారులను సంహరించి , తన ఆథిపత్యం లోకి తెచ్చుకున్నాడు.ఈ యుద్ధం శకవర్షం 1168 లో జరిగింది. త్రిపురాంతకం వద్ద కోనరాజులతో జరిగిన యుద్దం లో వెలనాటి సైన్యానికి  నాయకత్వం వహించింది కులోత్తుంగ రాజేంద్రచోడుని ప్రధాని అమృతలూరి మంచెన ప్రగ్గడ కుమారుడు  దేవన ప్రగ్గడ. ఇతడు హైహయులను పూర్తిగా ఓడించి, తరిమికొట్టి ,కృష్ణ గోదావరులను దాటి కోనమండలం లో ప్రవేశించి, శతృదేశాన్ని తగులబెట్టి , ఆక్రమించుకున్నాడు. ఇతని సాసనాలు శ.క 1085, శ.క. 1087 ల్లో ద్రాక్షారామం లో కన్పిస్తున్నాయి. ఇదే సమయం లో కాకతి రుద్రదేవుని శాసనం ఒకటి ద్రాక్షారామం లో కన్పిస్తోంది.  దీని కాలం క్రీ.శ .1168 . కాకతి రుద్రదేవుడు  కృష్ణ ను దాటి , ఉత్తరాన వున్న నతనాటి సీమ నేలుచున్న రాజులతో సంబంధబాంధవ్యాలను  ఏర్పరచుకొన్న  కాలమిది.
                              

                                  వెలనాటి కులోత్తుంగ చోడుడు కృష్ణనదికి ఉత్తరాన జరిగిన తిరుగుబాటు ను అణచి వేసి , స్వతంత్ర రాజ్యాన్ని ఏలుతున్న రోజుల్లో కర్నాటక లో సంభవించిన  గొప్ప రాజకీయ విప్లవం వలన కొచ్చెర్వుల పుర యుద్ధం సంభవించింది. ఈ యుద్ధాన్ని గురించి మంచెన కవి తన కేయూరబాహుచరిత్ర లో చక్కగా వర్ణించాడు. ఈ యుద్ధం లో కర్ణాటక సైన్నాన్ని ఎదుర్కోవడానికి కులోత్తుంగ చోడుడు తన ప్రధాని యైన కొమ్మనామాత్యుని  యుద్ధరంగానికి పంపాడు. కోటనాయకులు సహాయం చేశారు. వెలనాటి సైన్యానికి విజయం ప్రాప్తించింది. కులోత్తుంగచోడుడు కొండపడమటి బుద్ధరాజు సోదరి యైన అక్కమహాదేవిని పరిణయమాడాడు. వీరి మనుమడే పృధ్వీశ్వరుడు. వెలనాటి కులోత్తుంగ చోళుని చివరి రోజుల్లో  కృష్ణ దక్షిణ తీరాన్ని పాలిస్తున్న రాజ్యాలకు ముసలం వలే పల్నాటి యుద్ధం దాపురించింది.
          

     పల్నాటియుద్ధం.:-- ఈ పల్నాటి యుద్ధం లో కోట వారు , వెలనాటి వారు , పల్లవులు , భళ్ళా లులు, గుడిమెట్ట చాగివారు , కాకతీయులు పాల్గొన్నారు. కోటవారి లో     కోట రెండవ భీమరాజు ,
                                                                      
                                                                                    - 5-


                                కాకతీయులలో మొదటి రుద్రదేవుడు ( 1158- 1195 ) , వెలనాటి వారి లో మూడవ గొంకరాజు (1181-86), చాగివారి లో త్యాగి పోతరాజు  (1161-  ) , నలగామరాజు పక్షం వహించారు. పల్నాటియుద్ధం శా.శ (1098-1104 మథ్య జరిగినట్లు గా శ్రీ మల్లంపల్లి  సోమశేఖరశర్మ  భావించారు. పింగళి లక్ష్మీకాన్తం గారు  శా.శ 1095- 1104 మథ్య జరిగి ననట్లు గా  పల్నాటి వీరచరిత్ర పీఠిక లో సోపపత్తికం గా నిరూపించి యున్నారు.(భారతి-774.పే.అంగీరస.కార్తీక.) . భవరాజు కృష్ణరావు పంతులు గారు , చిలుకూరు వీరభద్ర రావు గారు శా.శ 1098—1104 నడుమ పల్నాటి యుద్ధం జరిగి ఉండవచ్చని భావించారు. అనగా క్రీ.శ 1176- 1182 మథ్య పల్నాటి యుద్దం జరిగిందని భావించవచ్చు.
                                                       

                                శ్రీనాథుని పల్నాటి వీరచరిత్రము చారిత్రక కావ్యము. ఈ కావ్యం లో చరిత్ర ,కల్పన పెనవేసుకున్నాయని విమర్శకులు భావిస్తున్నారు.(విజ్ఞాన సర్వస్వము-3219 పే.,తెలుగుసంస్కృతి-2) ఈ గ్రంధము నందు ప్రస్తావించిన వారందరూ కాకపోయినా ప్రధానవ్యక్తులు కొందరు చారిత్రక పురుషులు గా ప్రసిద్ధులు. వీరి జీవితకాలాన్ని  -  పల్నాటి యుద్ధం తో బేరాజు వేసి ఖ్రీ.శ 1176 – 82 మథ్య  ఈ యుద్ధం జరిగినట్లు అంగీకరించవలసి ఉంది. ఈ పల్నాటి యుద్దం చాగివారి పరిపాలనాకాలాన్ని నిర్ణయించడం లో ఆధారమైంది. కాబట్టి దీన్ని గురించి ఇంతగా చర్చించవలసి వస్తోంది.
                                             
                                ఈ పల్నాటియుద్ధం వలన పల్నాటి హైహయ రాజ్యం పూర్తిగా చితికి పోగా, రుగుపొరుగు మాండలిక రాజ్యాలు  ధన, ప్రాణ నష్టాలు కలిగి బలహీనమై పోయాయి. ఇదే అదనుగా  కళ్యాణం రాజధాని గా పరిపాలన సాగిస్తున్న కాళచురి సైన్యం కావణయ్య దండనాయకుని ఆథిపత్యం లో  వెలనాటి కులోత్తుంగచోడుని పై దండయాత్ర చేసింది. ఈ దండయాత్ర వలన వెలనాటి రెండవ కులోత్తుంగ చోడుని ప్రాభవం చాలవరకు అంతరించింది. ఈ కాలచుర్య నిశ్శంకమల్ల సంకమదేవుని ప్రధాన దండ నాయకుడైన కావణయ్య కు  “ వెలనాడు చోడయరాజ్య నిర్మూలన “అనే బిరుదు కూడ ఉంది. కాకతి రుద్రదేవుడు కూడ ఈ సమయం లో  పల్నాటియుద్దం లో నలగామునకు సహాయం వెళ్లినట్లు గా నటించి, వెనువెంటనే కృష్ణా దక్షిణ ప్రాంతంపైనే తన దండు నడిపాడు. కోటరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. కోట రాజ్యపతనం  కొండపడమటి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం కల్పించింది. విప్పర్ల వారు కూడ రుద్రదేవునికే సహాయం చేశారు.    “బుద్దవర్మ వంశ విస్తారక “ అనే బిరుదును పొందారు. అతికొద్దికాలం లోనే  అనగా క్రీ.శ .1185 నాటికే వెలనాటి లో చాలభాగం కాకతీయుల వశమైంది. ఇదే సమయం లో గుడిమెట్ట లో కాకతీయుల శాసనాలు కన్పిస్తున్నాయి.( Arc.314 )

 -        6 –
                   

                          పల్నాటియుద్ధం లో గుడిమెట్ట సామంతరాజ్యపు చారిత్రక వ్యక్తి  చాగి పోతరాజు పాల్గొన్నట్టు ఇంతకు ముందే చెప్పుకున్నాము.
                                          
                                              “సాగి పోతమరాజు సత్యాఖ్యప్రెగ్గడ
                                             గుండమదేవుడు గొబ్బూరి రాజు
                                              మొదలయిన వారల ముఖ్యులౌ బంట్లు
                                            -------------- నెనుబది  మీద
                                              నెనిమిది వేలతో  నే తెంచి రపుడు 


                               --- అని శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర. ఈ యుద్ధం క్రీ.శ. 1176-82  నడుమ జరిగి ఉంటుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. క్రీ.శ 1120  ప్రాంతంలో పురుడు పోసుకున్న చాగి మాండలిక రాజ్యం  లో ముప్ప భూపాలుడు, అనంతరం దోరభూపతి , వారి యనంతరం  మొదటి పోతరాజు. ఇతనినే త్యాగి పోతరాజు అని కూడ పిలుస్తారు.క్రీ.శ. 1140  ప్రాంతం లో రాజ్యానికి వచ్చిన  పోతరాజు పల్నాటియుద్ధ కాలం నాటికి మథ్య  వయస్కుడై  ఉండవచ్చు. అంతేకాదు .పల్నాటి యుద్ధానంతరం ఇతని శాసనాలేవీ  కన్పించడం లేదు. అందువలన మొదటి పోతరాజు పల్నాటి యుద్ధం లో మరణించి ఉండవచ్చని విమర్శకులు భావిస్తున్నారు. ఈతని యనంతరం ఈతని కుమారుడు రెండవ దోరభూపతి  రాజధానిని గుడిమెట్ట నుండి విజయవాటిక కు  మార్చి  క్రీ.శ .1197 వరకు రాజ్యపాలన చేసినట్లు శాసనాద్యాధారాలు లభిస్తున్నాయి. “ చాగిరాజ పంచదశ వర్షాణి విజయవాటికాం ధర్మమార్గేణ శశాస. “ అనగా పోతరాజు మరణానంతరమే దోరభూపతి తన రాజధానిని విజయవాటికకు మార్చినట్లు గా భావించవచ్చు.
                                  

                            అయితే పోతరాజు మరణానికి పల్నాటి యుద్ధం కాక వేరేకారణం ఒకటి గ్రంథాల్లో కన్పిస్తోంది. అదే వేములవాడ భీమకవి శాపవృత్తాంతం. వేటూరి వారి చాటుపద్యమణిమంజరి లో కన్పించే   “ హయ మది సీత పోతవసుదాధిపు డారయ రావణుండు  ---------------- “  ఇనే పద్యం వేములవాడ భీమకవి ది గా చాలామంది వ్రాశారు. ఈ పద్యం రెండవ తిరుమలయ్య దని అప్పకవి చెపుతున్నాడు. ఈ పద్యం లోని పోతరాజు సాగిపోతరాజు కాదని, వేటవరపు పోతరాజ ని, ఈ పద్యం తురగా రామకవి వేటవరపు రామకవి ని గూరిచు చెప్పిన పద్యమని శ్రీ కందుకూరి వీరేశలింగం , శ్రీ గుఱజాడ శ్రీరామమూర్వ్రాసియున్నారు. ఆంధ్రకవితరంగిణి కర్త శ్రీ చాగంటి శేషయ్య వేములవాడ భీమకవి కాలాన్ని , పోతరాజు కాలాన్ని సరి జూసి, భీమకవి తిట్టినదీ పోతరాజునే యని భావించితి మేని భీమకవి కాలము క్రీ.శ 1140-50 మథ్య కాలమని చెప్పి, మొదటి పోతరాజు ,రెండవపోతరాజు  లలో తికమకపడి, మనల్ని తికమకపెట్టి, మొదటిపోతరాజు కాలానికి భీమకవి కాలాన్ని సరిచేశారు.  అయితే పల్నాటి యుద్ధానికి ,దీనికి సరిపోవడం లేదు.
                                                                             
                                                                                   -7-
                          
                      భీమకవి తిట్టింది రెండవ పోతరాజు నేమో అనుకోవడానికి ,రెండవ పోతరాజు కాలం లో  రాజథాని విజయవాటిక  .కాబట్టి అక్కడ గుడిమెట్ట ప్రసక్తి రాదు.  మొదటిపోతరాజు – రుద్రమహారాజు, కోట భీమరాజులతో నలగామరాజు కు సహాయం  గా వెళ్లినవాడు. కాబట్టి భీమకవి కాలానికి ముందు వాడు. క్రీ.శ.1080 -1140 మథ్య కాలం లో జీవించిన వేములవాడ భీమకవి క్రీ.శ 1146 -79 మథ్య జీవిచిన పోతరాజుకు శాపం పెట్టడం సాథ్యం కాదు. పోనీ. రెండవ పోతరాజేమో అనుకుందామా అంటే ఇతను క్రీ.శ.1190 -1230 వరకు రాజ్యపాలన చేసినట్లు , సింహాచలం ,వేదాద్రి,  ముక్త్యాల వంటి పుణ్యక్షేత్రాల్లో అనేక దానధర్మాలు చేసినట్లు, నరసింహవర్ధనపోతరాజు గా కీర్తించబడినట్లు  అయా శాసనాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడకు భీమకవి కాలం కలవదు. భీమకవి చెప్పిన పద్యం ఇది.
                                 
                                       
                                    హయమది సీత పోతవసుదాథిపుడారయ రావణుండు ని
                                     శ్చయముగ నేను రాఘవుడ ; సహ్యజ వారధి ; మారుడంజనా
                                      ప్రియ తనయుండు ; లచ్చన విభీషణు డా గుడిమెట్ట లంక ; నా
                                         జయమును పోత రక్కసుని  చావును నేడవనాడు చూడుడీ !.


            
                          -ఈ పద్యం యొక్క పూర్వాపరాలు ఇలా చెప్పుకుంటున్నారు. భీమకవి దేశ సంచారం చేస్తూ  కృష్ణా తీరానికి వచ్చి   ఒక చల్లని ప్రదేశం లో  తన గుఱ్ఱాన్ని మేతకు విడిచి,  తాను విశ్రాంతి  తీసుకుంటున్నాడు.ఇంతలో ఆ గుఱ్ఱాన్ని చూచి మోజు పడిన పోతరాజు కుమారుడు, తన సైన్యం చేత దానిని బంధించి తీసుకుపోయాడని, కోపించిన భీమకవి ఈ శాపాన్ని ప్రయోగించాడని  ఈ ప్రాంతం  లోని వృద్దులుచెప్పుకుంటుంటారు. కాని పరిశోధనలో  వీరి కాలాలు కలవడం లేదు.
                                                      
                                                                                          - 8 –
                                   
                                            మొదటి పోతరాజు కాలం – క్రీ.శ .1140 – 82
                                       రెండవ దోర భూపతి    --- క్రీ.శ   --         - 1197
                                        రెండవ పోతరాజు  --         క్రీ.శ. 1197 –1230
                                         గణపయరాజు ---          ---------- - 1250
                                          మనుమ చాగి గణపయ --------  --    1270
                                           మూడవ పోతరాజు -------------       1282
                           
                            ఈతని యనంతరం భీమరాజు కుమారులు కొంతకాలం రాజ్యపరిపాలన చేసినట్లు శాసనాలు కన్పిస్తున్నాయి. ఇవి చాగి వారి పరిపాలనా కాలాలు. కొద్దిగా తేడాలు ఉండవచ్చు. కాబట్టి ముగ్గురు పోతరాజుల  కాలం లో ఏ కాలమూ భీమకవి కాలానికి (1080 -1140)  సరిపోవడం లేదు. కాబట్టి ప్రముఖ విమర్శకులు అక్కిరాజు ఉమాకాన్త గారు కూడ పై పద్యం  వేటవరపు పోతరాజుని గూర్చి చెప్పిందే నని  స్పష్టం చేశారు.
                                     
                              సమగ్రాంథ్ర సాహిత్య రచయిత శ్రీ ఆరుద్ర వీనినన్నింటినీ కూలంకషంగా పరిశీలించి,వేములవాడ భీమకవి కాలాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించారు. భీమకవి ఇతరులను గూర్చి చెప్పిన చాటువులు ,భీమనను గూర్చి అనంతర కవుల ప్రస్తావనలు ,ఆ యా రాజుల కాలాల్లోని శాసనాద్యాధారాలను సమన్వయం చేయడం తో పాటు శ్రీ ఆరుద్ర శ్రీ పూసపాటి రాచిరాజు రచించిన సీసమాలిక ను బట్టి నిడదవోలు వెంకటరావు గారి పరిశోధనలను ఉటంకించారు. ఈ సీసమాలిక లో వత్సవాయి వారి మూలపురుషుని గా దానరాజు ని పేర్కొని అతడు చంద్రవర్మ చే వత్సవాయి ని కానుక గా పొందాడని , ఈ బహుమానపు తారీఖు క్రీ.శ 1175 అని చెప్పబడిన దానిని ఆరుద్ర త్రోసిపుచ్చారు. వత్సవాయి వారి మూలపురుషుడు సాగి పోతరాజు అని,  వత్సవాయి గోపరాజు కు అంకితంగా ఏనుగు లక్ష్మణ కవి  రచించిన రామవిలాస కావ్యాన్ని గుర్తు చేశారు ఆరుద్ర . సలు గణపతి దేవునకు పూర్వం  ( క్రీ.శ 1320 )  వత్సవాయి అను పేరుగల రాజవంశమే లేదన్నశ్రీ చిలుకూరు వీరభద్రరావు గారి వాదనతో ఏకీభవించారు ఆరుద్ర. ( సమగ్ర ఆంథ్ర సాహిత్యం- చాళుక్యయుగం -ఆరుద్ర). తుదకు మైలమ భీముని కాలాన్ని, వేములవాడ భీమకవి కాలాన్ని  సరిచేసి  నిరూపించారు. అది  క్రీ.శ. 1121 . వేములవాడ భీమకవి కూడ ఆ
                                                                           - -

    కాలం వాడని సక్రమంగా నిరూపించవచ్చు.  పరిశోధకుల దృష్టి లో వేములవాడ భీమకవి కాలం క్రీ.శ .1121.  ఆనాటికి చాగి పోతరాజు లేడు. గుడిమెట్ట రూపుదిద్దుకుంటున్న తొలిరోజులవి.అందువలన  “హయము భీమకవి దే కాని పోతవసుధాధపుడు మాత్రం వేటవరపు పోతరాజేనని  అంగీకరిస్తే ఈ చర్చ ముగుస్తుంది.
                                         
                           ముప్పభూపాలుడు రాజేంద్రచోడుని నుండి పంచమహా శబ్దాలను పొంది , మహా మండలేశ్వరుడై, చాగి వంశానికి చారిత్రక పురుషుడైనాడు. రాజరాజనరేంద్రుని కుమారుడైనరాజేద్ర చోడుని కాలం నుండియే సామంతరాజ్యాలు , సామంత పదవులు ఆంధ్రదేశం లో విలసిల్లినట్లు గా చరిత్ర చెపుతోంది. గుడిమెట్ట శిథిలాల్లో కన్పించే ఒక శాసనం లో  ( తేదీ లేదు  )  రాజేంద్ర చోడుని నుండి ముప్పభూపాలుడు  పొందిన గౌరవాలు ప్రస్తావించబడ్డాయి.
                                                         
                                                              “ శ్రమ  ------------- ప ఇతి విశ్రుత నామధేయో
                                                               రాజేంద్ర చోడనృప -------- శుభ్రకత్తిక :
                                                                సోస్మాద్రాజేంద్ర చోడాదతులమర ---------
                                                                  ట్టకం ప్రాప్య చాలో ------------  ( ARC-313/1924 )
    
                                  ---    ఇత్యాదిగా రాజేంద్ర చోడ నృపుని ప్రస్తావన ఉంది. ఇచ్చట బిరుదులు శిథిలమైనాయి. ఇతను వెలనాటి చోడుడని ఒక వాదన ఉంది. కాని వెలనాటి చోడుని నాటికి మొదటి పోతరాజు పరిపాలన సాగుతోంది. అంతేకాదు. కొనకంచి లోని హనుమదాలయం లో   వెలనాటి చోడుని ,  మొదటి పోతరాజు శాసనాలు ఒకే బండకు రెండు వైపులా కన్పిస్తున్నాయి .(ARC- 269/24)  రాజేంద్రచోడుని కాలం క్రీ.శ.1146  గా వ్రాయబడింది. అనగా  శా.శ. 1068. అందువలన ముప్పభూపాలుని “ నుండే చాగి వారి పాలన ను గణించడం జరిగింది. చాగివారి శాసనాల్లో ఎక్కడా వారి ప్రభువుల సేవలో  వారి మేలు కోసం  శాసనాలు వేయబడినట్లు కన్పడ్డం లేదు. వీరి పాలనంతా మహామండలేశ్వరులు “ గా  సర్వతంత్ర స్వతంత్రులు గానే సాగినట్లు కన్పిస్తోంది. ఈ కాలం లోని కొందరు సామంతులు “   చాళుక్య రాజ్య సముద్ధరణ  “    “ చాళుక్య రాజ్య మూలస్థంభ   “ వంటి బిరుదు గద్యలతో శాసనాలు వ్రాయించారు. కాని చాగి వారి శాసనాల్లో మాత్రం అటువంటి బిరుదు గద్యలు కన్పించవు. చాగి వారి ఇలవేల్పు నరసింహస్వామి.  వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి పాదపద్మారాధకులు వీరు. వీరి శిథిల దుర్గానికి దగ్గర్లోనే   వేదాద్రి పంచనారసింహక్షేత్రం ఈనాటికీ  వెలుగొందుతూ భక్తులను కాపాడుతూనే ఉంది.  రెండవపోతరాజు నుండి మన్మగణపతిదేవరాజు వరకు లభించిన శాసనాల్లో నరసింహవర్ధన  బిరుదనామం సమానంగా కన్పిస్తోంది. రెండవపోతరాజు జుజ్జూరు శాసనం – పోతరాజు అల్లుళ్ళు వేయించింది. దీనిలో పోతరాజు ని ఇలా వర్ణించారు.

 శ్రీ యోగానంద నరసింహ దేవర దివ్యశ్రీ పాద పద్మారాధక
  “సమస్త సేనాగణనాలంకృత
  “చతుర్విధ పురుషార్ధ సాధక
  “దుష్టరిపు మర్ధన “
   “నరసింహవర్ధన “
     “మహామండలేశ్వర “          (ARC -326/24)
                  
                        దీన్ని బట్టి  ఆనాటి ప్రభువుల ఔదార్యం , మాండలికుల సర్వతంత్ర స్వతంత్రత్వం మనం ఊహించుకోవచ్చు. ఆనాటి ఈ మాడలికరాజ్యం గుడిమెట్ట,రంగరాజు కొండ శిథిలాల్లో మిగిలిపోయినా, వత్సవాయి ,పెద్దాపురం సంస్దానాల్లో మరి కొంతకాలం కొనసాగింది.
                                      

                         చాళుక్యచోళయుగం లో అంకరించిన ఈ గుడిమెట్ట రాజ్యం కాకతీయుల , రెడ్డిరాజుల పాలన లో పలు రీతుల పల్లవించి ,బహమనీ కాలం లో మట్టి లో కలిసిపోయింది. కుతుబ్షాహీ నవాబు బృహత్కాంచీపురం లో  పెనుగంచిప్రోలు  తన మూడవ యుద్ధాన్ని ముగించాడు. సుమారు రెండు శతాబ్దాల కాలం కొనసాగిన చాగి వారి పాలన లో ఏ ఒక్క కవీశ్వరుని కావ్యం ఆధారం గా లభించలేదు. అంటే ఆనాటి ఆంథ్రజాతి కాపాడుకోలేకపోయింది. లభించిన శాసనాలు సగానికి సగం  శిథిలమై పూర్తి సమాచారాన్ని  ఇవ్వలేకపోతున్నాయి. అందుకే ఒక్కటొక్కటి గా జారుతున్న నీటిబిందువులను    దొన్నెలోకి పట్టడానికి చేస్తున్న తొలి ప్రయత్న మిది. లభించిన ఆధారాలు కొద్ది. అల్లుకోవలసిన ఆకరాలు అతిమాత్రంగా అయినాయి.  శ్రీ యోగానంద నారసింహుని ఆశీస్సుల పరిఢవిల్లి ,రాణి రుద్రమదేవి పాదస్పర్శ తో పులకించి, పోతరాజు పరాక్రమాలతో విలసిల్లిన మాండలిక రాజ్యం ఈ గుడిమెట్ట.
                                       

                                                            మొదటి ప్రకరణం  సంపూర్ణం






****************************************************