శతక సౌరభాలు
-2
                                               ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము -7
పరిశీలించితి మంత్రతంత్రములు
చెప్పన్వింటి సాంఖ్యాది యో
గ రహస్యంబులు , వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంక వో 
దరయం 
గుమ్మడి కాయలోని యవగింజంతైన , నమ్మించి
, సు
స్ధిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే
శ్రీకాళహస్తీశ్వరా !
       శంకరా ! ఎన్నో మంత్రశాస్త్ర గ్రంధాలను
పరిశీలించాను . సాంఖ్యాది యోగరహస్యాలను తెలుసుకున్నాను . వేదశాస్త్రాలను  అధ్యయనం చేశాను . ఇంత చదివినా కూడ
గుమ్మడి
కాయ లో ఆవగింజంతైనా నాలోని అనుమానాలు నివృత్తి కాలేదు . స్వామీ  ! నాకు నమ్మకము కల్గునట్లు, శాశ్వత బ్రహ్మజ్ఞానము ను పొందగలిగే
మార్గాన్ని  ప్రసాదించవలసింది ప్రభూ  !
మొదలన్ చేసినవారి ధర్మములు నిర్మూలంబు
గా చేసి , దు
ర్మదులై  యిప్పటి వారె ధర్మమములొనర్పం ,దమ్ము దైవంబు న
వ్వదె , రానున్న దురాత్ములెల్ల తమత్రోవం 
బోవరే ఏల చే
సెదరో మీదు దలంచి చూడ రధముల్
శ్రీకాళహస్తీశ్వరా !
     శంకరా ! .పూర్వీకులు అనగా తమకు ముందు వారు చేసిన  ధర్మ నిర్ణయాలను  ఇప్పటి వారు స్వార్ధం తో మదోన్మత్తులై   మార్చివేసి క్రొత్త నిర్ణయాలను చేయడం చూసి దైవం  నవ్వుతోంది . ఎందుకంటే  రాబోయే తరం వారు కూడ వీరి మార్గం లోనే
దురాత్ములై  వీరు చేసిన నిర్ణయాలను
మారుస్తారు కదా . మూర్ఖులైన  వీరు ఈ
విషయాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు కదా !
                         అనగా తమ ముందు
ప్రభుత్వాలు చేసిన  కొన్ని నిర్ణయాలను
క్రొత్తగా వచ్చిన ప్రభుత్వాలు తిరుగదోడి , నూత్న నిర్ణయాలను తీసుకోవడం ఇప్పుడు
చూస్తున్నాము కాని ఈ విధానం  ధూర్జటి  కాలానికే ఉందని , దాని వలన ప్రజలు ఇబ్బందులు
పడుతూ , మళ్లీ వచ్చే పాలకులు వీనిని  ఎప్పుడు మారుస్తారని ఎదురు చూస్తుండేవాళ్ళని , ఈ
మాటల్లో మనకు అర్ధమౌతోంది .   
కాసంతైన సుఖం బొనర్చునొ,మన:కామంబు లీడేర్చునో 
 వీసంబైనను వెంటవచ్చునొ , జగద్విఖ్యాతి గావించునో
 దోసంబు ల్వెడబాపునో ,వలసినం దోడ్తో మిముంచూపునో
 ఛీ ! సంసార దురాశ యేలుడుపవో?
శ్రీకాళహస్తీశ్వరా !
       శంకరా ! మానవులమైన మాకు ఈ సంసారము మీద నున్న దురాశ  లేక ఆరాటం కొంచెమైనా సుఖాన్ని ఇస్తుందా  ! మనస్సులోని కోరికలు ఏమైనా
తీరుస్తుందా . మరణించినప్పుడు కొంచెమైనా వెంట వస్తుందా  ! పోనీ లోకం లో ఏమైనా కీర్తి
ప్రతిష్టలను కల్గిస్తుందా . చేసిన పాపాలను ఏమైనా కడిగేస్తుందా  ! అవసరమైనప్పుడు మీ దర్శనమైనా
కల్గిస్తుందా ! ఛీ ! ఛీ ! రోత కలిగించే ఈ సంసారము పై  మోహమును  ఎందుకు పోగొట్టవు స్వామీ ! ఈ సంసార బంధముల నుండి విముక్తి చేసి నీ చెంతకు చేర్చుకో ప్రభూ !
ఒక పూటించుక కూడు తక్కువగు
నేనోర్వంగలే ,దెండకో
కోపక నీడన్వెదకుం , చలిం జడిసి కుంపట్లెత్తుకో జూచు ,వా
నకు ఇండ్లిండ్లును దూరు , నీ తనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరు గాక మర్య్తులకటా ! శ్రీకాళహస్తీశ్వరా !
                శంకరా ! 
ఈ మానవులు ఎంత మూర్ఖులు. ఈ శరీరము ఒక్క పూట పిడికెడు అన్నం తక్కువైతే
తట్టుకోలేదు . ఎండ  వేడి కి తాళలేక నీడను
వెతుక్కుంటుంది.  చలికి భయపడి కుంపట్లను
కావిలించు కోవాలనుకుంటుంది . వాన వచ్చిందంటే తలదాచుకోవడానికి ఇల్లిల్లు
వెతుక్కుంటుంది . అటువంటి ఈ శరీరం  వలన
కలిగే సుఖాలను  అసహ్యించుకొని ,  జనులు శాశ్వత మైన బ్రహ్మ పదమును  ఎందుకు కోరుకోలేకపోతున్నారు  ఎంత ఆశ్చర్యము ..
కేదారాది  సమస్త తీర్ధములు కోర్కిం జూడ బోనేటికిన్ 
కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస
శైలంబు నీ 
పాదధ్యానము సంభవించునపుడే భావింప
నజ్ఞాన ల
క్ష్మీ దారిద్ర్యులు గారె లోకులకటా ! శ్రీకాళహస్తీశ్వరా !  (80)
               ఈశ్వరా  ! నీ పాదధ్యానము సంభవించినపుడే 
ముంగిలి వారణాసి  కడుపే కైలాసగిరి
అవుతుంది . అది తెలియని ఈ  జనులు  కేదారాది పుణ్య తీర్థముల దర్శనానికి
పరుగెత్తుతున్నారు  నిన్ను భావిస్తే  అజ్ఞానమనెడి సంపద తొలగి శాశ్వత
జ్ఞానవంతులవుతారు కదా  !  
తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్
మ్రుచ్చిలం 
గ మహోద్యోగము సేయు నెమ్మనము
దొంగంబట్టి వైరాగ్య పా
శములంజుట్టి బిగించి నీదు చరణ
స్తంభంబునం గట్టివై
చి ముదంబెప్పుడుఁ గల్గజేయఁ గదవే
శ్రీకాళహస్తీశ్వరా ! 
   
            శ్రీ కాళహస్తీశ్వరా . నా మనస్సనెడి దొంగ పర స్త్రీల
యందాసక్తి , పరధనములను దొంగిలించుట యందు వ్యామోహము చే ఆరాటపడు చున్నాడు. ఆ దొంగ
ను  పట్టి 
వైరాగ్య పాశములతో  బంధించి ,  నీ పాదములనెడి స్తంభములకు కట్టివేసి శాశ్వతమైన
ఆనందాన్ని నాకు ఎప్పుడు కల్గిస్తావో  కదా
ప్రభూ  !
వేధం దిట్టగ రాదు గాని భువి లో
విద్వాంసులం జేయనే 
లా థీచాతురిఁ  జేసిన గులామాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ కలిగింపనేల యదికృత్యంబైన
దుర్మార్గులన్
ఛీ ధాత్రీశులఁ జేయనేటి కకటా ! శ్రీకాళహస్తీశ్వరా !
               ఈశ్వరా ! ఆ బ్రహ్మదేవుని నిందించకూడదు కాని ఈ భూమి
మీద పండితులను సృష్టించడం ఎందుకు  తన
బుద్ధి నైపుణ్యము తో చేసినను  ఆ బ్రతుకును
అలానే పోనీయక మధ్యలో ఆకలి బాధలను కల్గించడమెందుకు. అది ఆయన ధర్మమైన
దుర్మార్గులైన  ఈ రాజులను  సృష్టించడమెందుకు . మాకు ఈ బానిస జీవనాన్ని
ఇవ్వడం ఎందుకు  స్వామీ ! 
పుడమి న్నిన్నొక బిల్వ పత్రముననేఁ బూజించి  పుణ్యంబునుం
బడయ న్నేరక పెక్కుదైవములకుం బప్పుల్
ప్రసాదంబులుం
గుడుముల్ దోసెలు  సారెసత్తు లటుకుల్ గుగ్గిళ్ళునుం
 బెట్టుచున్ జెడి యెందుం గొఱగాక పోదు రకటా ! శ్రీకాళహస్తీశ్వరా ! ( 84 )
                   శంకరా ! ఈ భూమి మీద  నిన్ను ఒక్కమారేడు దళముతో పూజించినను పుణ్యము
కలుగుతుంది. ఆ విధంగా పుణ్యాన్ని పొందకుండా 
ఈ మూర్ఖపు జనులు అన్యదైవాలను ఆశ్రయించి  
వారికి వడపప్పులు ,  ప్రసాదాలు
,  కుడుములు , అట్లు , జంతికలు , అటుకులు ,
గుగ్గిళ్ళు మొదలైన నివేదనలను సమర్పిస్తూ  చెడిపోయి
,  రెంటికీ  పనికిరాకుండా పోతున్నారు కదా  ! 
విత్తజ్ఞానము పాదు నిత్యము భవావేశంబు
రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురంబనృతముల్ , మారాకు
లత్యంత దు
ర్వ్యత్తుల్ పువ్వులు పండ్లు
మన్మధముఖావిర్భూత దోషంబులుం
చిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీ
కాళహస్తీశ్వరా !
               శంకరా !  మనస్సు లో పెరిగే
వేపచెట్టుకు  ధన వ్యామోహమే పాదు . మనస్సులో
కలిగే ఆవేశ కావేశములే కంచె . అహంభావమే నీరు .  
మనం ఆడే అబద్దాలే  మొలకలు . చేసే
చెడు పనులే మారాకులు . 
కామసంబంధమైన తప్పులే పూలు పండ్లు 
కావున ఈ వృక్షాన్ని నా మనస్సులో నుండి తొలగించి జ్ఞాన వృక్షాన్ని  నాటవలసింది స్వామీ  !
నీపై గావ్యము జెప్పుచున్న యతడు న్నీపద్యముల్
వ్రాసి యి
మ్మా పాఠం బొనరింతునన్న యతడున్
,మంజుప్రబంధంబు ని
ష్టా పూర్తిం బఠియించుచున్న యతడున్
సద్భాంధవుల్ గాక ఛీ
ఛీ పృష్టాగత బాంధవంబు నిజమా శ్రీ
కాళహస్తీశ్వరా !
               శంకరా  ! నీ
యొక్క మాహాత్య్మాన్ని గురించి  కావ్యము
వ్రాసేవారు  ,  నిన్ను గురిచి పద్యాలు వ్రాసిస్తే  పారాయణ చేసుకుంటానని  కవులను అర్ధించేవారు , నీ యొక్క   మనోహర ప్రబంధములను మధురముగా గానము చేయువారే  నాకు బంధువులు కాని జన్మ సంబంధమైన
బంధువులు  నాకు బంధువులు కారు .  
సంపద్గర్వముఁ బాఱఁదోలి రిపులన్
జంకించి యాకాంక్షలన్
దంపుల్వెట్టి  కళంకముల్నఱికి బంధక్లేశ దోషంబులం
జింపుల్చేసి , వయోవిలాసములు
సంక్షేపించి , భూతంబులం
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా ? శ్రీ కాళహస్తీశ్వరా !
          శ్రీకాళహస్తీశ్వరా ! 
ఐశ్వర్యము వలన వచ్చిన గర్వాన్ని పారద్రోలి , అరిషడ్వర్గాలనే
అంతశ్శత్రువులను భయపెట్టి , కోరికలను పాతర వేసి, పాపములను  అరికట్టి , స్వపర భావనాదులచే ఏర్పడ్డ తప్పులను
నశింపజేసి , వయస్సు వలన వచ్చు కామాది వికారములను నిగ్రహించుకొని , భవబంధములను
తెంచుకోనెడల నీ దర్శన భాగ్యము మాకు లభించదు కదా స్వామీ !
నిన్నం జూడరొ మొన్నఁజూడరొ జనుల్
నిత్యంబుఁజావంగ నా
పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి
న్విసర్జింప లే
కున్నారెన్నడు నిన్ను గందురిక
మర్త్యుల్ గొల్వరేమో నిను
న్విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ
కాళహస్తీశ్వరా !
                   పరమేశ్వరా ! మూర్ఖులైన ఈ జనులు  తమ కళ్ళ ఎదుట 
రోజూ జనం చచ్చిపోవడం చూస్తూనే ఉన్నారు . కాని ఆపదలో పెన్నిధానం వలే  అనుకొని ఎన్నడు కూడ ధనం మీద వ్యామోహాన్ని
మాత్రం వదులు కోలేక పోతున్నారు.  ఏ రోజు
ఇతర మోహాలను వదలి నిన్ను ఆశ్రయిస్తారో తెలియదు . ఇతర దేవతలను పూజిస్తూ నిన్ను చిన్నబుచ్చుతున్న
ఈ జనులు అవివేకులు .
రాజశ్రేణికి దాసులై ,సిరుల గోరంజేరగా
సౌఖ్యమో
ఈ జన్మంబు తరింపజేయగల మిమ్మే ప్రొద్దు
సేవించు ,ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో
మానవుల్పాపరా
జీ జాతాది మదాంధ బుద్దులగుచున్ శ్రీ
కాళహస్తీశ్వరా !
              ఈశ్వరా !  ఈ
జనులు చేసిన పాపముల చేత ఈ భూమిపై  పుట్టి
,  మదాంధులైన ఈ నరులు అజ్ఞానము చేత
కప్పివేసి.రాజులకు దాస్యం చేస్తూ సంపదల నాశించడం సౌఖ్యమా ?
లేక మిమ్ములను సదా సేవించి కైవల్యాన్ని పొందడం సౌఖ్యమో?
తెలుసుకోలేక  పోతున్నారు .
వన్నే ఏనుగు తోలు దుప్పటము ,బువ్వా
కాలకూటంబు , చే
గిన్నే బ్రహ్మ కపాలముగ్రమగు భోగే
కంఠహారంబు , మే 
ల్నిన్నీలాగున నుంటయుం దెలిసియు న్నీ
పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుఁడెట్లు మానసమునన్  శ్రీ కాళహస్తీశ్వరా !     (90 )    
                    శ్రీ శంకరా ! 
నీవు కట్టే బట్ట ఏనుగు చర్మము . తినే ఆహారము కాలకూట విషం. చేతిలోని గిన్నె
బ్రహ్మ కపాలము . కంఠాభరణాలు  భయంకర
సర్పాలు   మరి ఇవన్నీ తెలిసి కూడ
లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు నీ పాదపద్మాలను తన మనస్సు లో చేర్చి  నిన్ను  ఎలా పూజిస్తున్నాడు స్వామీ !
                                               
చదువుతూ.... ఉండండి .  చివరి భాగం
త్వరలో
********************************************************************************

