Sunday, 7 October 2012

అంతా రామమయం –మరొక అనుబంధం


                               
అంతా రామమయం –మరొక అనుబంధం

                                      ప్రపంచంలోనే శ్రీమంతుడైన మన ఏడుకొండల శ్రీనివాసునకు గత రెండువేల సంవత్సరాలుగా ఎంతోమంది సార్వభౌములు,  చక్రవర్తులు, సామంతుల,నుండి సామాన్య భక్తుల వరకు సమర్పించిన బంగారు నాణాలను సాక్షి దినపత్రిక ఆదివారం 15 సెప్టెంబరు 2012 సంచికలో ప్రచురించింది. దీనిలో క్రీ.శ 1వ శతాబ్ధంలో రోమన్ చక్రవర్తి  కాలం లో ముద్రించిన రాజు రాణి తోకూడిన అరుదైన నాణాలు, క్రీ.శ 8 నుంచి10 వ  శతాబ్ధం లోని పశ్చిమ గంగరాజుల నాణాలు....తర్వాత పల్లవులు,హోయసాళులు  చోళులు  పాండ్యులు యాదవులు విజయనగరరాజులు వరహాలు గద్దేనము ఫణం పోనులు  మొఘల్ అక్పర్ హైదరాలీ టిప్పుసుల్తాన్ బ్రిటీషు ఈస్టిండియా ముద్రించిన పగోడాలు, మొహర్లు, అష్రఫీలు
వీటిలో ఉన్నాయి    అని వ్రాయబడింది .{ సాక్షిఫన్ డే  16-9-2012 -30 వ పేజి}                                                                                                                                                         
                   దీన్ని తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక గా సాక్షి అందించింది. వీనిలో మనం ప్రకటించిన బంగారు నాణెం లేక పోవడం  నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది . మ్యూజియం లో పెట్టబోయే నాణాల్లో ఉంటుందేమో వేచిచూడాలి. తిరుమలమ్యూజియంలో బంగారు నాణాలను సందర్శించే అవకాశాన్ని టి.టి.డి. కల్పించబోతుండటం ఆహ్వానించదగ్గదే.    విజ్ఞులతో పంచుకోవడానికే ఈ విషయాన్ని మీముందుంచుతున్నాను. ఈ నాణాలను ప్రచురించిన సాక్షి దినపత్రిక కు కృతజ్ఞతలు.

                        
                                 సాక్షి పత్రిక లోనివి { ఛాయాచిత్రం}
 ఇది మనం ప్రచురించిన నాణెం
       ఛాయాచిత్రం
 ******************************************************************************