అ హ ల్య ప్రథమ భాగము
శ్రీ బ్రహ్మ మానస పుత్రిక యై , మహర్షి, మంత్రద్రష్ట, న్యాయసూత్ర ప్రణేత, అక్షపాదుడు నైన గౌతమ మహర్షిని పరిణయ మాడి పంచకన్యలలో ప్రథమతాంబూలం అందుకుంటున్న పతివ్రతా శిరోమణి అహల్య.
హలం నామేకహా వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్
యస్యా
నవిద్యతే హల్యం తేనాహల్యేతి విశ్రుతా !! {వా. ఉ.-30.29 ]
హల్య మనగా వైరూప్యం. అది లేనిది అహల్య. సర్వాంగసుందరి గా సృష్టికర్త చేతనే ప్రశంసించబడిన సౌందర్యం అహల్య ది. కాని- ఈమె పై చెలరేగినంత దుమారం సాహిత్యలో మరే పాత్ర మీద లేదంటే అతిశయోక్తి కాదు. వేదవాజ్ఞ్మయం నుండి దక్షిణాంథ్ర సాహిత్యం మీదుగా ఆధునిక సాహిత్యం వరకు అహల్య అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తోంది. తైత్తిరీయారణ్యకంలో ఇంద్రుణ్ణి యాగానికి ఆహ్వానించే సందర్భంలో ---
“ ఇంద్రాగచ్ఛ హరివ ఆగచ్ఛమేథాతిథే :
మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కంది న్నహల్యాయై జార
కౌశిక
బ్రాహ్మణ గౌతమ బ్రువాణ “ { కృ.య.తై.ఆరణ్యకం—2-70}
గౌతమ- అహల్య- ఇంద్ర- కౌశిక అనునవి రామాయణ పాత్రలు. శ్రీరామచంద్రుడు ఆ
పాత్రలను పునీతం చేశాడు. పైమంత్రానికి విద్యారణ్యుల వారి భాష్యాన్ని పరిశీలిస్తే –“- హే
ఇన్ద్ర పరమైశ్వర్యయుక్త : ఇహ
కర్మణ్యాగచ్ఛ హరివ- హరినామక అశ్వౌ అస్య విద్యతే ... ... ..... తస్మిన్నర్థే వృషణశ్వస్య మేనే
“ ఈరీతిగా వైదికపరంగా కొనసాగిన వ్యాఖ్యానంలో” అహల్యాయై జార” అన్న పదానికి—“అహల్యా గౌతమస్య భార్యా తస్యా ఇంద్రే జార ఇతి పురాణే ప్రసిద్థం “ అని వదిలి వేయడం మనం గమనించవచ్చు.
కర్మణ్యాగచ్ఛ హరివ- హరినామక అశ్వౌ అస్య విద్యతే ... ... ..... తస్మిన్నర్థే వృషణశ్వస్య మేనే
“ ఈరీతిగా వైదికపరంగా కొనసాగిన వ్యాఖ్యానంలో” అహల్యాయై జార” అన్న పదానికి—“అహల్యా గౌతమస్య భార్యా తస్యా ఇంద్రే జార ఇతి పురాణే ప్రసిద్థం “ అని వదిలి వేయడం మనం గమనించవచ్చు.
శ్రీ కుమారిలభట్టు తన తంత్రవార్తికంలో వేదములందలి ఇంద్రాహల్యల ప్రస్తావన ను వివరిస్తూ -- చంద్రుడే గౌతముడు. గో శబ్దమునకు ఉత్తమ కిరణములని యర్థము.
{ సర్వేపి రశ్మయ: గావ ఇత్యుచ్యంతే } . చంద్రుని యొక్క భార్య యగు రాత్రియే అహల్య.”
కనుక ఇంద్రశబ్దవాచ్యుడగు సూర్యుడు ఉదయింపగానే అహల్య అనగా రాత్రి నశించిపోతోంది. కావుననే ఇంద్రుడు” అహల్యాయై జార” --అని సంబోథించ బడుచున్నాడు.
నిరుక్తంలో ” అహల్యా యై జార” అను శ్రుతివాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ—“ఆదిత్యో2త్ర జార ఉచ్యతే రాత్రే ర్జరయితా “-- అనగా సూర్యుడే ఇంద్రుడు . రాత్రిని ఫోగొట్టుటచే అతడు” అహల్యాయై జార “అని సంబోధించబడుచున్నాడు.
భట్ట భాస్కరులు “ అహల్యాజారు “డనగా వాక్పరిణామకారకుడగు ఇంద్రుడని, “గౌరావస్కంది...”.అన్న మంత్రంలోని ” గౌర “శబ్దమునకు ఆద్యంత గ్రహణం చేత “గౌతమ దార” అని వ్యాఖ్యానించారు.
ఈ వివరణల్ని పరిశీలిస్తే గౌతమ-అహల్య- ఇంద్ర శబ్దాలు వేదంలో ప్రతీకాత్మకంగా ప్రయోగించ బడ్డాయని తెలుస్తుంది . కాని – వేదాలకన్న భిన్నంగా రామాయణాది కావ్యాల్లో రమణీయేతివృత్తంగా అహల్య కథ రూపు దాల్చింది. రామాయణంలో అహల్యా వృత్తాంతం రెండు ప్రదేశాల్లో కన్పిస్తుంది. బాలకాండ లోని వృత్తాంతంలో అహల్య దోషిగా కన్పిస్తుంటే –ఉత్తరకాండ లోని వృత్తాంతం ఆ దోష పరిహారార్థం చెప్పబడినట్లు కన్పిస్తుంది. బాలకాండ కథలో ఇంద్రుడు గౌతమమహర్షి వేషంలో వచ్చినట్లు తెలిసి కూడ అహల్య- ఇంద్రునిపై మక్కువతో ---
ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన
మతిం చకార దుర్మేథా దేవరాజ కుతూహలాత్
!! { వా.బాల.48-19}
ఇంద్రునకు తనను తానుగా అర్పించుకున్నట్లు వ్రాయబడగా, ఉత్తరకాండలో ఆమె తెలియకపోవుటచే తన భర్త యే ననుకొని అతని కోరిక తీర్చినట్లు వ్రాయబడింది.
అజ్ఞానాత్
ధర్షితా విప్ర త్వద్రూపేణ దివౌకసా
న కామకారాత్ విప్రర్షే ప్రసాదం కర్తు మర్హసి { వా-ఉ.కాం.30-44}
--- అని ప్రార్థిస్తుంది అహల్య. బాలకాండ కథలో అహల్య పాపనిష్కృతిని పొందగా ఉత్తరకాండలో ఇంద్రుడు పాప పరిహారాన్ని పొందాడు. గౌతమ మహర్షి శాపాన్ని పొందిన ఇంద్రుడు ----
కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మన :
క్రోధ ముత్పాజ్య హి మయా సుర కార్య మిదం కృతం {వా.ఉ .కాం.49-2}
సురకార్యాన్ని నిర్వహించ గలిగానన్న తృప్తితో దేవలోకానికి వెళ్లి పోతాడు. ఇది క్లుప్తంగా అహల్యా వృత్తాంతం.
రావణుడు సీతను అపహరించాడు. రాముడుద్థరించాడు. అక్కడ సీత ఏఅపచారం చేయలేదు. కాని రాముడాగ్రహించాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిపునీతయైన సీత “ దీప్తామగ్నిశిఖామివ “అన్నట్లు ప్రకాశించింది వాల్మీకంలో.
దేవకార్యం కోసం ఇంద్రుడు అహల్యను చేరాడు. గౌతముడు కోపించాడు -శపించాడు . రామచంద్రుడుద్థరించాడు. తపించిన అహల్య” దీప్తామగ్నిశిఖామివ “ వలె ప్రజ్వరిల్లింది. పునీతలైన సీత- అహల్య లిద్దరికి ఒకే విశేషణం వాడటంలోని మహర్షి అంతర్యం అత్యంత నిగూఢము. అతి పవిత్రము కూడా.
హల మనగా నాగలి . సీత – నాగేటి చాలు. అనగా నాగలి చే ఏర్పడింది.