శతకసౌరభాలు
- 5
సుమతీ శతకము -3
తన
వారు లేని చోటను
జన
వించుక లేని చోట జగడము చోటన్
అనుమాన
మైన చోటను
మనుజునకును నిలువఁ దగదు మహిలో సుమతీ !
ఓ సుమతీ ! మనకు తెలిసిన వారు ఎవ్వరు లేని ప్రదేశం లోను , మనకు పరిచయం
లేని ప్రదేశ మందు , మాటి మాటికి తగాదాలు
వచ్చే ప్రదేశం లోను , ఎప్పుడు ఏం జరుగుతుందో నని
అనుమానం ఉండే ప్రదేశం లోను బుద్ధి
మంతుడైన మానవుడు నివసించకూడదు.
తమలము సేయని
నోరును
విమతులతో
జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
గమలములు
లేని కొలకును
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ !
ఓ సుమతీ ! తాంబూలము వేసుకోని నోరు , తామర పూలు లేని కొలను , చంద్రుడు లేని రాత్రి , దుర్మార్గులతో సహవాసం చేసి కష్టాలు తెచ్చుకొనే జ్ఞానము . విలువలేనివి. వ్యర్థములు
తప్పు చేయడం మానవ
సహజం. కాని తను చేసిన తప్పు తెలుసుకొని
పశ్చాత్తాపం తో
కొత్త జీవితాన్ని ప్రారంభించని మానవ జీవితం అడవి గాచిన వెన్నెల వలే వృథా
అవుతుంది.
తల
నుండు విషము ఫణికిని
వెలయంగాఁ
దోకనుండు వృశ్చికమునకున్
తల దోక
యనక యుండును
ఖలునకు
నిలువెల్ల విషము గదరా సుమతీ !
ఓ సుమతీ ! పాము నకు కోరలలోను , తేలునకు తోక లోని కొండి లోను విషముంటుంది కాని దుర్మార్గునకు తల ,తోక అనక పై నుంచి క్రిందవరకు శరీరమంతా విషముంటుంది .
అంటే పాము కన్నా , తేలుకన్నా కూడ దుర్మార్గుడే ఎక్కువ ప్రమాదకారి .
తల పొడుగు
ధనముఁ బోసిన
వెలయాలికి
నిజము లేదు వివరింపంగా
దల
దడివి బాస జేసిన
వెలయాలిని
నమ్మరాదు వినరా సుమతీ !
ఓ సుమతీ ! వెలయాలు నిలువెత్తు ధనమిచ్చినప్పటికీ అంటే
తులాభారం చేసినా దాని మాటల్లో నిజం
ఉండదు.. తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేసినా కూడ వేశ్య మాటలను ఎప్పుడూ నమ్మవద్దు.
తల
మాసిన వొలుమాసిన
వలువలు
మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాంత లైన
రోతురు
తిలకింపగ
భూమి లోన దిరముగ సుమతీ !
ఓ సుమతీ ! ఈ భూమి పైన
మనిషికి నిర్మలమైన మనస్సు తో పాటు
శారీరక శుభ్రత కూడ అవసరమే. ఎందుకంటే మాసిన
తలతో , మాసిన బట్టల తో, ఒళ్లు కంపు కొడుతూ తిరుగుతుంటే కట్టుకున్న పెళ్ళాం కూడ అసహ్యించు కుంటుందంటే
ఇతరులను గురించి చెప్పాల్సిన పనేముంటుంది.
తాను
భుజింపని యర్థము
మానవ పతిఁ
జేరు గొంత మఱి భూగతమౌఁ
గానల
నీగలు గూర్చిన
దేనియ
యొరు జేరునట్లు తిరముగ సుమతీ !
ఓ సుమతీ ! ఈ లోకం లో
తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను పూల నుంచి
సంగ్రహించి కూడ బెడతాయి. కాని ఆ
తేనె వాటి అనుభవానికి రాకుండా పరుల
పాలౌతుంది . అలాగే లోభి వాడు తను
తిన కుండా ఇతరులకు పెట్టకుండా పైసా పైసా కూడబెట్టిన సొమ్ము చివరకు కొంత భాగం
రాజుల పాలు , మరి కొంత నేలలో దాచిపెట్టడం మూలంగా భూమి పాలు అవుతుంది కాని పిసినారి అనుభవానికి మిగలదు.
దగ్గర
కొండెము సెప్పెడు
ప్రెగ్గడ
పలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు
ప్రజ కాచరించుట
బొగ్గులకై
కల్పతరువుఁ బొడుచుట సుమతీ !
ఓ సుమతీ ! రాజు పితూరీలు చెప్పే మంత్రి మాటలను ఆమోదిస్తూ , తన ప్రజలకు హాని చేయడానికి
ప్రయత్నించడ మంటే కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షాన్ని బొగ్గులకోసం
నరికించడానికంటే కూడ నికృష్టమైన పని.
ప్రజలు చల్లగా ఉంటేనే రాజు పచ్చగా ఉంటాడు. ఆ విషయాన్ని మర్చిపోయిన రాజు తన గుంటను తానే
తవ్వుకున్నవాడౌతాడు.
ధనపతి
సఖుడై యుండియు
నెనరంగా
శివుడు భిక్షమెత్తగ వలసెన్
దనవారి
కెంత గలిగిన
దన
భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ !
ఓ సుమతీ ! ధనాధిపతి యైన
కుబేరుడు తనకు ప్రియమిత్రుడైనప్పటికీ పార్వతీ
నాథుడైన శంకరుడు భిక్ష మెత్తుకోవలసి వచ్చింది. అంటే తన వారి కెంత ఉన్నా తనకు ఏ
మాత్రం లాభంలేదు. మనకు ఎంతవరకు ప్రాప్తమో అంతే మనకు దగ్గుతుంది కాని ప్రాప్తం లేనిది పరమాణువు కూడ మనకు అంటదు.
ఒంటికి ఆముదం రాసుకొని
బంగారు రేణువులపై పొర్లాడినా మనకు ఎంత ప్రాప్తమో అంతే అంటుకుంటుంది కాని
అంతకు మించి రేణువు కూడ అంటు కోదు. అందుకే “యత్ప్రాప్తం తద్భవతి ” అన్నది ఆర్యోక్తి.
నడవకుమీ
తెరువొక్కట
గుడువకుమీ శత్రునింటఁ గూరిమి తోడన్
ముడువకుమీ
పర ధనముల
నుడువకుమీ
యొరుల మనసు నొవ్వగ సుమతీ !
ఓ
సుమతీ !
ప్రయాణించేటప్పుడు దారి లో వీలున్నంత వరకు ఒంటరిగా ఎప్పుడూ ప్రయాణంచేయవద్దు. శతృవు ఇంట ఏ
రోజు కూడ స్నేహం గా భుజించ వద్దు. ఇతరుల ఆస్తులను
ఆక్రమించుకోవద్దు. ఎదుటి వారి
మనస్సు గాయ పడేటట్లు మాట్లాడవద్దు .అలా చేయడం వలన అనంతర కాలం లో మనకు కీడు సంభవించ వచ్చని హెచ్చరిక.
నమ్మకు
సుంకరి జూదరి
నమ్మకు
మగసాలి వాని నటు వెలయాలిన్
నమ్మకు
మంగడి వానిని
నమ్మకుమీ
వామ హస్తు నవనిని సుమతీ !
ఓ సుమతీ ! ఈ లోకం లో మనం
ఎవ్వరినీ పూర్తి గా నమ్మకూడదు . అట్లాగని నమ్మనట్లుండ కూడదు . ముఖ్యంగా పన్నులు వసూలు చేసేవాడిని , జూదమాడే వానిని ,
బంగారపు పని చేసే కంసాలిన , వేశ్యలను ,
సరుకులు అమ్మే దుకాణ దారుని , ఎడమ
చేతి తో పనులు చేసే ఎడమచేతి వాటం ఉన్న వాడిని అస్సలు నమ్మకూడదు.
నయమున బాలుం ద్రావరు
భయమున విషమ్మునైన
భక్షింతురుగా
నయ మెంత దోసకారియో
భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ !
ఓ సుమతీ ! ఈ సమాజం బ్రతిమలాడితే మాట వినదు . భయపెడితే దాసోహం
అంటుంది. ఎలాగంటే మంచి మాటలతో పాలు కూడ తాగనివారు భయపెడితే
విషాన్నైనా గుటుక్కున మింగేస్తారు.
అందుకే మంచి మాటలు చెపితే వినరు కాని భయపెట్టి ఎంతపని నైనా సాధించుకోవచ్చు. మంచి
మాటలతో సాధించలేని పనులను భయపెట్టి సాధించుకోవచ్చు . అందుకే “నయానో , భయానో ” అనే మాట లోకాన
ప్రసిద్ధమైంది.
నరపతులు
మేర దప్పిన
దిర
మొప్పగ విధవ యింటఁ దీర్పరి యైనన్
గరణము
వైదికుఁడైనను
మరణాంతక
మౌను గాని మానదు సుమతీ !
ఓ సుమతీ ! కంచే చేను
మేసినట్లు, శాసనాలు చేసే వాడే శాసనోల్లంఘనం
చేసి , పరిపాలించే రాజే హద్దు మీఱి
ప్రవర్తించినా , విధవరాలైన స్త్రీ ఇంటి
పెత్తనం సాగించినా , వైదిక
బ్రాహ్మణుడు కరణీకం చేసినా , పెను ప్రమాదం సంభవించి ప్రాణం పోయే పరిస్థితి
దాపురిస్తుంది. అది తేలికగా తీసుకునే విషయం కాదు.
నవరస భావాలంకృత
కవితాగోష్ఠి
యును మధుర గానంబులునున్
నవివేకి
కెంతఁ జెప్పినఁ
జెవిటికి
శంఖూదినట్లు సిద్ధము సుమతీ !
ఓ సుమతీ ! అవివేకి యైన వాడికి
నవరసభావ భరితమైన కవితాగోష్టి ని, మధురమైన సంగీతాన్ని ఎంత విన్పించినా చెవిటి వాని ముందు శంఖము పట్టినట్లు నిష్ఫలమే కాని
ఎటువంటి ఫలితము ఉండదు .
నవ్వకుమీ
సభ లోపల
నవ్వకుమీ
తల్లిఁదండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ
పరసతి తో
నవ్వకుమీ
విప్రవరుల నయముగ సుమతీ !
ఓ సుమతీ ! పెద్దలు కొలువు
దీరిన నిండు సభ లోను , తల్లి దండ్రుల తోను
, యజమాని తోను , ఇతరుల భార్యల తోను ,
బ్రాహ్మణులను చూసి నవ్వకూడదు .
“నవ్వు నాలుగు విధాల చేటు ”అనే సామెత ఉన్నదే కదా.
నీరే ప్రాణాధారము
నోరే
రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె
నరులకు రత్నము
చీరయె
శృంగార మండ్రు సిద్ధము సుమతీ !
ఓ సుమతీ ! ఎల్ల ప్రాణులకు నీరే ప్రధాన ఆధారం . నవరస పూర్ణమైన సంభాషణ కు నోరు ఆధారము. నరులకు స్త్రీ యే రత్నము వంటిది . అందుకే నారీ రత్నం
అంటారు. స్త్రీల వస్త్ర ధారణ విషయం లో
చీర కట్టు లోనే శృంగారముందంటారు రసికులు .
పగ వల దెవ్వరి తోడను
వగవంగా
వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు
సభలను
మగువకు
మన సీయవలదు మహిలో సుమతీ !
ఓ సుమతీ ! లోకం లో నలుగురితో
మంచిగా ఉండటం నేర్చుకోవాలి. ఎవ్వరి తోను శతృత్వం పెట్టుకోకూడదు. దారిద్య్రం వచ్చినప్పుడు దు:ఖించడం వలన ప్రయోజనం
లేదు. సభల్లో మాట్లాడే టప్పుడు ఎవ్వరినీ నిందిస్తూ , దూషిస్తూ మాట్లాడకూడదు. స్త్రీల కు రహస్యాలను చెప్పవద్దు.
పతి
కడకుఁ దన్ను గూర్చిన
సతి
కడకును వేల్పు కడకు సద్గురు కడకున్
సుతు
కడకు రిత్తచేతుల
మతిమంతులు
చనరు , నీతిమార్గము సుమతీ !
ఓ సుమతీ ! రాజు వద్దకు , లేక తన పై అధికారి
వద్దకు వెళ్ళేటప్పుడు , పండుగ పబ్బాలకు వెళ్లి పుట్టింటి లో ఉన్న భార్య
దగ్గరకు వెళ్లేటప్పుడు , దేవాలయానికి
వెళ్ళేటప్పుడు , గురువు చెంతకు వెళ్లేటప్పుడు ,
పిల్లలు , వృద్ధులు , బాలింతరాళ్లు , రోగుల వద్దకు వెళ్ళేటప్పుడు బుద్ధిమంతులు
పండో , ఫలమో , పూలో, కాయలో
తీసుకెళతారు కాని వట్టిచేతులతో వెళ్ళరు .ఇది నీతి మార్గము .
రిక్తహస్తములు
అంటే వట్టిచేతులు . “రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం ” అనేది సంస్కృత మూలం
. కుచేలుడు వంటి పరమ దరిద్రుడు కూడ కృష్ణపరమాత్మ ను చూడటానికి వెళుతూ చిఱిగిన ఉత్తరీయ చెంగున అటుకులు తీసికెళ్ళిన విషయం
మనకు తెలుసు.
కులకాంత
పనిచేయు
నెడల దాసియు
ననుభవమున
రంభ , మంత్రి యాలోచనలన్
దన
భుక్తి యెడలఁ దల్లియు
ననఁ
దన కులకాంత యుండ నగురా సుమతీ !
ఓ సుమతీ ! ఈ లోకము నందు
కులకాంతలు తమ ఇంటి పనులు చేసే టప్పుడు దాసి వలెను , భర్త తో కలిసి ఉన్నప్పుడు రంభ వలెను , అవసరమైన ఆలోచనలు
చేయునపుడు భర్తకు మంత్రి వలెను , భోజనము
పెట్టునపుడు తల్లి వలెను , ఇల్లాలు అనురాగవల్లి యై సంసారము నందు మెలగవలెను.
ఈ పద్యము నకు సంస్కృత
మూలము ఇట్లున్నది.
“ కార్యేషు దాసీ , కరణేషు మంత్రీ
రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనేతు రంభా
షఢ్ధర్మ యుక్తా కులధర్మపత్నీ !!’’
ఈ శ్లోకం లోని రెండవపాదం లోని భావం “ రూపము లో లక్ష్మి వలెను ,ఓర్పు లో భూదేవి
వలెను ” అనేది తెలుగులో
వదిలి వేయబడింది.
పర సతి కూటమిఁ గోరకు
పర ధనముల కాసపడకు
పరునెంచకుమీ
సరిగాని గోష్ఠి సేయకు
సిరి చెడిఁ జుట్టంబు కడకుఁ
జేరకు సుమతీ !
ఓ సుమతీ ! పర స్త్రీల సంగమాన్ని ఏనాడు కోరుకోవద్దు. ఇతరుల సంపదలకు ఆశ
పడ వద్దు . ఎంత సేపు పరులు చేసే పను లలోని
తప్పులు ఎత్తి చూపవద్దు. నీ స్థాయి కి తగని వారితో సంభాషణలు చేయవద్దు. సిరి చెడి
ఏనాడూ చుట్టాల ఇంటికి వెళ్ళవద్దు .ఆస్థి
పోయిన వేళ బంధువుల గడప తొక్కకూడదు . అనేది నీతి
“ అలిగి అత్తారింటికి చెడి
చెల్లెలింటికి వెళ్ళ కూడదంటారు ” జానపదులు.
ఉత్తముడు
పర నారీ సోదరుడై
పరధనముల
కాసపడక పరులకు హితుడై
పరులు
దనుఁ బొగడ నెగడక
పరులలిగిన
నలుగ నతడు పరముడు సుమతీ !
ఓ సుమతీ ! పరస్త్రీలను తోబుట్టువులు గా
భావిస్తూ , ఇతరుల ధనముల కాశపడక ,
పరోపకారియై , ఎల్లప్పుడు
ఇతరులకు సహాయం చేస్తూ , ఇతరులు తనను పొగిడితే ఉబ్బి పోక , తెగడితే
కోపించుకోని వాడే ఉత్తముడు , సర్వ శ్రేష్టుడు గా చెప్పబడుతున్నాడు,
గృహస్థ ధర్మాలు
పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి
నింద పడున్
బరసతి సుశీల యైనను
బరు సంగతి నున్న నిందపాలగు
సుమతీ !
ఓ సుమతీ ! ఈ భూమి యందు
పరస్త్రీల తో సంభాషించే పురుషుడు భీష్ము డంతటి వాడైనా కూడ నిందల పాలౌతాడు.
అలాగే స్త్రీ ఎంతటి సుగుణవతి యైనా పరపురుషుని తో స్నేహం చేయడం వలన అపనిందల పాలౌతుంది.
ఇది నిజం.
ఒఱు నాత్మఁ దలచుఁ సతి విడు
మఱు మాటలు పలుకు సుతుల
మన్నింపకుమీ
వెఱ పెరుగని భటు నేలకు ,
తఱచుగ సతిఁ గవయఁ బోకు తగదుర
సుమతీ !
ఓ సుమతీ ! మనస్సు లో ఇతరుని
కోరుకుంటూ నీతో ఉంటున్న భార్యను వదిలి వేయడం మంచిది. ఎదురు సమాధానాలు చెప్పే
కొడుకుల్ని ఏనాడు క్షమించకూడదు .
భయభక్తులు లేని సేవకుడ్ని పనిలో
ఉంచుకుని పోషించ కూడదు . వెంటనే పనిలో
నుంచి తీసెయ్యాలి. మాటి మాటికి ఇల్లాలితో
సంగమించవద్దు . ఇవన్నీ గృహస్థుడు
ఆచరించవలసిన నియమాలు.
పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుఁ బనులు లేక
పోవకు మెపుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
యెఱిగియు బిరుసైన హయము
నెక్కు సుమతీ !
ఓ సుమతీ ! ఇతరులకు ఇష్టం లేని
, కష్టం కలిగించే మాటలను మాట్లాడ వద్దు. ఎటువంటి పనీ లేకుండా ఊరికినే
ఇరుగు పొరుగు ఇళ్ళకు వెళ్ళడం , బాతాఖానీలు వేసుకొని కూర్చోవడం మంచిది కాదు. పరుని కలిసిన స్త్రీని కలవకూడదు .
తెలిసి తెలిసి పొగరుబోతైన గుఱ్ఱాన్ని ఎక్కి ప్రయాణించ కూడదు .
పర్వముల సతుల గవయకు
యుర్వీశ్వరు కరుణ నమ్మి
యుబ్బకు మది లో
గర్వింప నాలిఁ బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ !
ఓ సుమతీ ! పర్వదినాల్లో
స్త్రీ సంగమం నిషేధము . రాజు చూపిస్తున్న దయను తలచుకొని అది
నిజమని నమ్మి ఉబ్బిపో కూడదు .
ఎందుకంటే రాజసేవ కత్తి వాదర పై నడక
వంటిది. భార్యకు గర్వము కలిగేటట్లు గా
ఆమెకు చనువు ఇయ్యవద్దు. కుటుంబ పోషణ సాగని ప్రదేశం లో నివసించవద్దు.
ఇవి గృహస్థుని ధర్మాలు.
పలు దోమి సేయు విడియము
తల గడిగిన నాటి నిద్ర
,తరుణుల యెడలన్
బొల యలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా
సుమతీ !
ఓ సుమతీ ! దంతధావనం చేసుకొని వేసుకున్న తాంబూలము , తలంటు పోసుకున్న నాటి నిద్ర , భార్యాభర్తల నడుమ ప్రణయ కలహం తరువాత
కలిగే సంగమం అత్యంత సౌఖ్యదాయకాలు . వీటి విలువ
ఇంతింత యని చెప్పలేనిది.
పిలువని పనులకు పోవుట
కలయని సతి రతియుఁ రాజు గానని
కొలువుం
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయ వలదుర
సుమతీ !
ఓ సుమతీ ! మనకు ఆహ్వానం లేని పనులకు వెళ్ళకూడదు . మనసులు
కలవని మగువ తో
కలయిక మంచిది కాదు . రాజు గుర్తించని సేవ , పిలవని పెళ్ళి , పేరంటానికి తగుదునమ్మా యని వెళ్ళి కూర్చోవడం , తనం టే
ఇష్టము లేని , ప్రేమ చూపని వానితో స్నేహం చేయడం
కూడ బుద్ధి మంతుడు మానుకోవాలి.
************************** చివరి భాగం త్వరలో ***************