శతకసౌరభాలు
-1
                                              కంచర్ల గోపన్న     దాశరథీ శతకము -4 
                  “ రామహరే ! కకుత్ధ్సకుల రామహరే! రఘురామరామ శ్రీ
          రామహరే ! “ యటంచు మది రంజిల భేక గళంబు లీల నీ
          నామము సంస్మరించిన జనంబు భవం బెడఁ బాసి
త్వత్పరం
          ధామ నివాసులౌదురఁట దాశరథీ !  కరుణాపయోనిధీ
!
                   శ్రీరామా !  కప్పలరచినట్లు ఏ వేళలో నైనను “ శ్రీరామ  హరే  రఘు రామహరే కకుత్థ్సకుల రామ హరే  “ అని భజించిన  మాత్రాన భవబంధములు తొలగిపరంధాముని వాసము
చేరుదురట.    
          చెక్కెరలప్పకున్ మిగులజవ్వని
కెంజిగురాకు మోవికిన్
           జొక్కపు జుంటితేనియకుం జొక్కిలుచుం
గనలేరు గాక నే
           డక్కట రామనామ మధురామృత మానుట కంటె
సౌఖ్యమా
           తక్కిన మాధురీ మహిమ ? దాశరథీ ! కరుణాపయోనిధీ !
               శ్రీరామచంద్రా !  కలకండ,కాంతల కెమ్మోవి , జుంటితేనె మొదలైన వాటియందు ఆశ తో
నరులు తెలిసి కొనలేరు గాని శ్రీరామ నామ మనెడి తీయని అమృతమును త్రాగుట వలన కల్గెడి  ఆనందమున కన్న ఇతర ఏ పదార్ధములును  అంత ఆనందము కల్గదు కదా !
        అండజవాహా ! నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్
        కొండల వంటి వైన వెసఁ గూలి నశింపకయున్నె? సంతతా
        ఖండల వైభవోన్నతులు గల్గక మానునే
మోక్షలక్ష్మి కై
        దండ యొసంగకయున్నె తుది ?  దాశరథీ ! కరుణాపయోనిధీ
!
                ఓ శ్రీరామా  ! గరుడవాహనుడా ! నిన్ను హృదయమున నమ్మిన వారి పాపములు కొండల వంటి వైన నశించిపోతాయి.  వారికి అఖండ వైభవోన్నతులు ప్రాప్తిస్తాయి.
చివరకు మోక్షలక్ష్మి  కూడ చేయూత నందించి
చెంతకు చేర్చుకుంటుంది కదా !
          చిక్కని పాలపై మిసిమి జెందిన  మీగడ పంచదార తో
         మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధా
రసంబు నా
         మక్కువ పళ్లెరంబున సమాహిత దాస్య మనేటి
దోయిటన్
         దక్కె నటంచు జుఱ్ఱెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !
         శ్రీరామా! చిక్కని పాలమీగడ ను పంచదార తో మెక్కిన రీతి
గా నిర్మలమైన   మీ యొక్క సుందర రూపమనెడి
అమృతమును ప్రేమ యనెడు బంగారు పళ్లెరము లో   శ్రద్ధయనెడు దోసిలి   తో తనివి తీర త్రాగెదను.
              ఈ పద్యము లో ఎంతో మధురమైన
రూపకాలంకారము ఉంది. ఈ శతకం లోని  అన్ని
పద్యాల్లోను ఏదో ఒక అలంకారం కన్పించడం కూడ ప్రత్యేకత గా చెప్పవచ్చు.
          
 సిరులిడ సీత ,పీడలెగజిమ్ముటకున్ హనుమంతుఁడార్తి సో
             దరుడు సుమిత్రసూతి , దురితంబుల మానుప రామనామమున్
             గరుణ దలిర్ప మానవులఁ గావగ బన్నిన
వజ్రపంజరో
             త్కరముగదా భవన్మహిమ దాశరథీ ! కరుణాపయోనిధీ !
                                          శ్రీ
రామా !  సంపద లివ్వడానికి సీతాదేవియు ,ఆపదలను తరిమివేయడానికి ఆంజనేయుడు , శ్రమ ను
పోగొట్టడానికి లక్ష్మణుడు ,పాపములను పోనడప రామనామమును అనునవి
కరుణ తో మానవులను కాపాడుటకు ఏర్పరచిన వజ్రపంజరము కదా నీ మహిమ మహాప్రభూ !
                 హలకులిశాంకుశధ్వజ శరాసన శంఖ ఱధాంగ కల్ప
కో
           జ్వలజలజాత రేఖలను సాంకములై
కనుపట్టుచున్న మీ
           కలిత పదాంబుజ ద్వయము గౌతమపత్ని
కొసంగినట్లు నా
           తలపునఁ జేర్చి కావఁగదె ! దాశరథీ ! కరుణాపయోనిధీ !
                శ్రీదాశరథీ ! దయాసముద్రా !  నాగలి ,వజ్రాయుధము ,
అంకుశము ,ధ్వజము , ధనస్సు
, శంఖము ,చక్రము , కల్పవృక్షము , కమలము వంటి రేఖలతో శుభలక్షణములు  కల్గిన మీ దివ్యపాదములను  గౌతమపత్ని యైన అహల్య కు అనుగ్రహించినట్లే
నామనస్సు లో  కూడ  చేర్చి నన్ను రక్షింపుము .
          జలనిధిలోన దూటి , కులశైలము మీటి ,ధరిత్రి గొమ్మునం
         దలవడ మాటి ,రక్కసుని యంగము గీటి ,బలీంద్రునిన్ రసా
         తలమున మాటి ,పార్ధివ కదంబముఁ గూల్చిన మేటి రామా
         తలఁపున నాటి రాఁగదవె ? దాశరథీ ! కరుణాపయోనిధీ !
                 శ్రీ
దాశరథీ !
మత్స్యమువై  సముద్రమును జొచ్చి , కూర్మము వై మందర పర్వతము నెత్తి , వరాహమవై భూమిని
కోరతో ఉద్ధరించి , నరసింహుని వై  హిరణ్య కశిపుని వక్షమును చీల్చి సంహరించి , వామనుడవై బలిచక్రవర్తి ని పాతాళమునకు పంపి, భార్గవరాముడ
వై రాజసమూహమును సంహరించిన  శ్రీ రామా
!  నామనస్సు నందు నిశ్చలం
గా  నివసింపుము .
               భండన భీముఁ డార్తజనబాంధవుఁ
డుజ్వలబాణతూమ కో
          దండ కళాప్రచండ భుజతాండవ మూర్తి కి
రామమూర్తికిన్
          రెండవసాటి దైవమిక లేఁడనుచున్ గడఁగట్టి
భేరి కా
          దండ డడాండడాండ నినదంబు లజాండము నిండ
మత్త వో
          దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణాపయోనిధీ!  ( 34 )
                     శ్రీరామా  ! యుద్ధరంగమునందు
శత్రుభయంకరుడును , ఆశ్రిత జన రక్షకుండును ,ధనుర్బాణములతో పరాక్రమ విక్రముడైన మా శ్రీరామమూర్తి కి సమానమైన దైవము
మరొక్కడు లేడని , జయపతాకను చేత పట్టి మత్తగజేంద్రము  మీద ఎక్కి 
దండ డడాండ డాండ యను నగారా శబ్దములతో బ్రహ్మాండము బద్దలగునట్లు గా  మ్రోగించి మరీ చాటుతాను.
                         తన స్వామి యెడల భక్తుని
భక్తి పరాకాష్ట కు చేరితేనే ఇటువంటి పద్యాలు వస్తాయి. భక్త్యావేశం లో పద్యపాదం కూడ
ఒకటి పెరిగి పోయింది. ఈ పద్యాన్ని భక్తరామదాసు అయిన కంచర్లగోపన్న కాకుండా  రామబంటు శ్రీ ఆంజనేయుడే చెప్పాడా అన్నంత ఆవేశం
తో ఆంధ్రదేశం లో  రామ భక్తులు ఈ పద్యాన్ని
గానం చేసి  ,పులకించి పోతుంటారు. 
                        అవనిజ కన్నుదోయి తోగలందు వెలింగెడు సోమ జానకీ 
              కువలయనేత్రగబ్బి చనుగొండలనుండు
ఘనంబు ,మైధిలీ
              నవనవయౌవనంబను వనంబునకున్ మదదంతి
నీవెకా
              దవిలి భజింతు నిన్నెపుడు దాశరథీ ! కరుణాపయోనిథీ !
                    శ్రీరామా ! సీతాదేవి  కన్నులనెడి కలువలకు
చంద్రుని వంటి వాడవు , జానకీదేవి స్తన శైలము లందుండెడి మేఘుడవు ,  సీతాదేవి నవయౌవనమనెడి వనమునకు మదపుటేనుగు
వంటివాడవు నైన నిన్ను నేను ఎల్లప్పుడు సేవించెదను.
                           ఈ పద్యం లో శ్రీ రామ
చంద్రుని శృంగార రాముని గా దర్శించి 
ఆనందిస్తున్నాడు కవి.  కవులకు , వాగ్గేయకారులకు తన ప్రభువును
శృంగార రాయని గా సైతం వర్ణించడం ఒక సంప్రదాయం గా 
వస్తోంది. పదకవితా పితామహుడు అన్నమయ్య 
శ్రీవేంకటేశ్వరుని  గూర్చి ఆలపించిన
శృంగార కీర్తనలు  ప్రత్యేక విభాగం క్రిందకే
వస్తున్నాయి.  శ్రీ రామదాసు కూడ ఈ మార్గం
లోనే ఉన్నాడని చెప్పుకోవడం కోసమే ఈ పద్యాన్ని ఉటంకించాను. ఇటువంటివి  మరికొన్ని వస్తే  ..... దాటి వెళదాం. ఈ పద్యం లో    “మైధిలీ నవయౌవనంబను వనంబుకున్
మదదంతి “ ( సీతాదేవి యొక్క  
నవయవ్వనమనే వనానికి మదపుటేనుగు వంటివాడా ) 
అన్న పోలిక మాత్రం రామభక్తుల మనస్సు ను 
చివుక్కు మనిపిస్తుంది.
          ఖరకర వంశజా !  వినుమఖండిత భూత పిశాచ
ఢాకినీ
         జ్వర పరితాప సర్ప భయవారకమయిన భవత్పదాబ్ఝ
వి
         స్భుర దురు వజ్రపంజరము  జొచ్చితి ;  నీయెడ దీనమానవో
         ద్ధర బిరుదాంక మేమఱకు దాశరథీ ! కరుణాపయోనిథీ !
                        శ్రీరామచంద్రా !. సూర్య వంశమునందు పుట్టిన వాడా!  భయంకమైన భూత పిశాచ , ఢాకినీ పీడలు ,జ్వర పాప దుఖ సర్ప భయములు తొలగించెడి
నీపాదకమల సేవయనెడి గొప్ప వజ్రపంజరము నందు 
నేను ప్రవేశించితిని . ఓ రామా! నీకు  దీనమానవోద్ధరణుడనెడి  బిరుదు ఉన్న సంగతి మర్చిపోకుండా , నన్ను రక్షించవలసినది.
                                                   
           చదువుతూ ఉండండి. 
మరికొన్ని అందిస్తాను.
********************************************************************************

