శ్రీ రామ కావ్యామృతం ----2
తెలుగు లో ఎందరో
భక్త కవులు రామకధను కావ్యాలుగా, తమకు నచ్చిన
మెచ్చిన వచ్చిన రీతిలో గానం చేసి, శ్రీరామ నామా
మృత పానంతో ధన్యజీవుయ్యారు. లఘు కావ్యాల లో అమృత గుళికల వంటి కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం
ఆశించని వాటిని రసజ్ఞులైన రామభక్తులతో కలసి పంచు కోవడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశ్యం. .
“ రాముని కంటె నన్యము పరాత్పరు డొక్కడు లేడు
,సర్వశో
భామయమైన
ప్రాకృతిక భాగ్యమునుండి యనంత దైవిక
శ్రీ మిళితంబునై
రఘువరేణ్యుని మూర్తియు శక్తినొప్పు, న
మ్మా! మఱి రామ నామ
జపమంగళ గీతము లాలపింపుమా!
“ యోగులయందునన్
పరమయోగి, మహర్షులలో మహర్షియున్
భోగుల యందునన్ బరమభోగి,యఖండతపస్వి. సర్వశా
స్త్రాగమ
వేద్యుడున్ ,రఘువరాన్వయ దివ్యమణి ప్రదీపమున్”
“ రాముడె దిక్కు నీకు! రఘురాముడె
నీకు విముక్తి నిచ్చు,శ్రీ
రాముడె జన్మ
కర్మల పరంపర లన్ దెమలించు, జానకీ
రాముడె సర్వధర్మ చయ
రాజిత సాధుపవిత్ర మూర్తి”
“ రాముని దివ్యనీల రుచిరమ్ములె సుందరవారిదమ్ములై
స్వామి
సుమిత్ర సూతి తను సాంద్ర కళారుచులే తటిత్తులై
ప్రేమను
వారి భాషణము లే కలితమ్ములు మేఘగర్జలై
ఆమని వర్షముల్ కురియు నట్లుగతోచె, - నతండు రాముడే”.
“
రాముని కంటి కోసల విరాజిలు కాంతులె శారదీయ పూ
ర్ణామల చంద్రికా నిభములై, యనుజన్ముని కంటి వెల్గులే
శ్రీమహితారుణారుణ మరీచి వితానములై, పవ్త్ర సం
ధ్యా మధుమాధురీ శబలితమ్ములు తోచె – నతండు రాముడే”.
“రాముని
దివ్యమంగళ విరాజిత రూపము దగ్గఱింపగా
నామెకు గుండెయెల్ల దడయై జడయై – ధృఢమై –
నితాంత ని
ష్కామనమై – శరీర మవశమ్మయి వ్రాలగ
జేతులెత్తి శ్రీ
రామ! నమో! నమో! యనుచు వ్రాలె పదంబుల భక్తిమూర్తియై.”
“వాలి పోవు
కనుఱెప్పలన్ పైకి తెరచి
చూపుతోడనె
రఘుపతిం జుఱ్ఱునట్లు
తనివి తీరని చూడ్కులన్ దడవి కొనుచు
నిలిచిపోయెను ముదుసలి – నిముసమట్లె.”
“తండ్రి సగ భాగమైన సీతమ్మ లేని
కడమ యర్ధమె యింతటి కాంతులీన
రెండు
నొకటిగ నున్న భరింపగలమె.”
“చలన మెఱుగని
భక్తియే చాలు గాని
తనువులెంతటి దూరమో మనసులంత
దగ్గరగ నుండి యొండొంటి తారసిలును.”
కవి. పెమ్మరాజు
వేణుగోపాలకృష్ణమూర్తి కావ్యం. శబరి . తల్లిదండ్రులు వరలక్ష్మమ్మ, సూర్యప్రకాశరావు. జన్మస్ధలం. చిట్యాల, జననతేది. 23.10 1912 తిరువూరు తాలూకా
***************************శ్రీరామ జయమ్********************