శతక సౌరభాలు
-2
ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము -7
పరిశీలించితి మంత్రతంత్రములు
చెప్పన్వింటి సాంఖ్యాది యో
గ రహస్యంబులు , వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంక వో
దరయం
గుమ్మడి కాయలోని యవగింజంతైన , నమ్మించి
, సు
స్ధిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే
శ్రీకాళహస్తీశ్వరా !
శంకరా ! ఎన్నో మంత్రశాస్త్ర గ్రంధాలను
పరిశీలించాను . సాంఖ్యాది యోగరహస్యాలను తెలుసుకున్నాను . వేదశాస్త్రాలను అధ్యయనం చేశాను . ఇంత చదివినా కూడ
గుమ్మడి
కాయ లో ఆవగింజంతైనా నాలోని అనుమానాలు నివృత్తి కాలేదు . స్వామీ ! నాకు నమ్మకము కల్గునట్లు, శాశ్వత బ్రహ్మజ్ఞానము ను పొందగలిగే
మార్గాన్ని ప్రసాదించవలసింది ప్రభూ !
మొదలన్ చేసినవారి ధర్మములు నిర్మూలంబు
గా చేసి , దు
ర్మదులై యిప్పటి వారె ధర్మమములొనర్పం ,దమ్ము దైవంబు న
వ్వదె , రానున్న దురాత్ములెల్ల తమత్రోవం
బోవరే ఏల చే
సెదరో మీదు దలంచి చూడ రధముల్
శ్రీకాళహస్తీశ్వరా !
శంకరా ! .పూర్వీకులు అనగా తమకు ముందు వారు చేసిన ధర్మ నిర్ణయాలను ఇప్పటి వారు స్వార్ధం తో మదోన్మత్తులై మార్చివేసి క్రొత్త నిర్ణయాలను చేయడం చూసి దైవం నవ్వుతోంది . ఎందుకంటే రాబోయే తరం వారు కూడ వీరి మార్గం లోనే
దురాత్ములై వీరు చేసిన నిర్ణయాలను
మారుస్తారు కదా . మూర్ఖులైన వీరు ఈ
విషయాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు కదా !
అనగా తమ ముందు
ప్రభుత్వాలు చేసిన కొన్ని నిర్ణయాలను
క్రొత్తగా వచ్చిన ప్రభుత్వాలు తిరుగదోడి , నూత్న నిర్ణయాలను తీసుకోవడం ఇప్పుడు
చూస్తున్నాము కాని ఈ విధానం ధూర్జటి కాలానికే ఉందని , దాని వలన ప్రజలు ఇబ్బందులు
పడుతూ , మళ్లీ వచ్చే పాలకులు వీనిని ఎప్పుడు మారుస్తారని ఎదురు చూస్తుండేవాళ్ళని , ఈ
మాటల్లో మనకు అర్ధమౌతోంది .
కాసంతైన సుఖం బొనర్చునొ,మన:కామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ , జగద్విఖ్యాతి గావించునో
దోసంబు ల్వెడబాపునో ,వలసినం దోడ్తో మిముంచూపునో
ఛీ ! సంసార దురాశ యేలుడుపవో?
శ్రీకాళహస్తీశ్వరా !
శంకరా ! మానవులమైన మాకు ఈ సంసారము మీద నున్న దురాశ లేక ఆరాటం కొంచెమైనా సుఖాన్ని ఇస్తుందా ! మనస్సులోని కోరికలు ఏమైనా
తీరుస్తుందా . మరణించినప్పుడు కొంచెమైనా వెంట వస్తుందా ! పోనీ లోకం లో ఏమైనా కీర్తి
ప్రతిష్టలను కల్గిస్తుందా . చేసిన పాపాలను ఏమైనా కడిగేస్తుందా ! అవసరమైనప్పుడు మీ దర్శనమైనా
కల్గిస్తుందా ! ఛీ ! ఛీ ! రోత కలిగించే ఈ సంసారము పై మోహమును ఎందుకు పోగొట్టవు స్వామీ ! ఈ సంసార బంధముల నుండి విముక్తి చేసి నీ చెంతకు చేర్చుకో ప్రభూ !
ఒక పూటించుక కూడు తక్కువగు
నేనోర్వంగలే ,దెండకో
కోపక నీడన్వెదకుం , చలిం జడిసి కుంపట్లెత్తుకో జూచు ,వా
నకు ఇండ్లిండ్లును దూరు , నీ తనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరు గాక మర్య్తులకటా ! శ్రీకాళహస్తీశ్వరా !
శంకరా !
ఈ మానవులు ఎంత మూర్ఖులు. ఈ శరీరము ఒక్క పూట పిడికెడు అన్నం తక్కువైతే
తట్టుకోలేదు . ఎండ వేడి కి తాళలేక నీడను
వెతుక్కుంటుంది. చలికి భయపడి కుంపట్లను
కావిలించు కోవాలనుకుంటుంది . వాన వచ్చిందంటే తలదాచుకోవడానికి ఇల్లిల్లు
వెతుక్కుంటుంది . అటువంటి ఈ శరీరం వలన
కలిగే సుఖాలను అసహ్యించుకొని , జనులు శాశ్వత మైన బ్రహ్మ పదమును ఎందుకు కోరుకోలేకపోతున్నారు ఎంత ఆశ్చర్యము ..
కేదారాది సమస్త తీర్ధములు కోర్కిం జూడ బోనేటికిన్
కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస
శైలంబు నీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప
నజ్ఞాన ల
క్ష్మీ దారిద్ర్యులు గారె లోకులకటా ! శ్రీకాళహస్తీశ్వరా ! (80)
ఈశ్వరా ! నీ పాదధ్యానము సంభవించినపుడే
ముంగిలి వారణాసి కడుపే కైలాసగిరి
అవుతుంది . అది తెలియని ఈ జనులు కేదారాది పుణ్య తీర్థముల దర్శనానికి
పరుగెత్తుతున్నారు నిన్ను భావిస్తే అజ్ఞానమనెడి సంపద తొలగి శాశ్వత
జ్ఞానవంతులవుతారు కదా !
తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్
మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయు నెమ్మనము
దొంగంబట్టి వైరాగ్య పా
శములంజుట్టి బిగించి నీదు చరణ
స్తంభంబునం గట్టివై
చి ముదంబెప్పుడుఁ గల్గజేయఁ గదవే
శ్రీకాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా . నా మనస్సనెడి దొంగ పర స్త్రీల
యందాసక్తి , పరధనములను దొంగిలించుట యందు వ్యామోహము చే ఆరాటపడు చున్నాడు. ఆ దొంగ
ను పట్టి
వైరాగ్య పాశములతో బంధించి , నీ పాదములనెడి స్తంభములకు కట్టివేసి శాశ్వతమైన
ఆనందాన్ని నాకు ఎప్పుడు కల్గిస్తావో కదా
ప్రభూ !
వేధం దిట్టగ రాదు గాని భువి లో
విద్వాంసులం జేయనే
లా థీచాతురిఁ జేసిన గులామాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ కలిగింపనేల యదికృత్యంబైన
దుర్మార్గులన్
ఛీ ధాత్రీశులఁ జేయనేటి కకటా ! శ్రీకాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! ఆ బ్రహ్మదేవుని నిందించకూడదు కాని ఈ భూమి
మీద పండితులను సృష్టించడం ఎందుకు తన
బుద్ధి నైపుణ్యము తో చేసినను ఆ బ్రతుకును
అలానే పోనీయక మధ్యలో ఆకలి బాధలను కల్గించడమెందుకు. అది ఆయన ధర్మమైన
దుర్మార్గులైన ఈ రాజులను సృష్టించడమెందుకు . మాకు ఈ బానిస జీవనాన్ని
ఇవ్వడం ఎందుకు స్వామీ !
పుడమి న్నిన్నొక బిల్వ పత్రముననేఁ బూజించి పుణ్యంబునుం
బడయ న్నేరక పెక్కుదైవములకుం బప్పుల్
ప్రసాదంబులుం
గుడుముల్ దోసెలు సారెసత్తు లటుకుల్ గుగ్గిళ్ళునుం
బెట్టుచున్ జెడి యెందుం గొఱగాక పోదు రకటా ! శ్రీకాళహస్తీశ్వరా ! ( 84 )
శంకరా ! ఈ భూమి మీద నిన్ను ఒక్కమారేడు దళముతో పూజించినను పుణ్యము
కలుగుతుంది. ఆ విధంగా పుణ్యాన్ని పొందకుండా
ఈ మూర్ఖపు జనులు అన్యదైవాలను ఆశ్రయించి
వారికి వడపప్పులు , ప్రసాదాలు
, కుడుములు , అట్లు , జంతికలు , అటుకులు ,
గుగ్గిళ్ళు మొదలైన నివేదనలను సమర్పిస్తూ చెడిపోయి
, రెంటికీ పనికిరాకుండా పోతున్నారు కదా !
విత్తజ్ఞానము పాదు నిత్యము భవావేశంబు
రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురంబనృతముల్ , మారాకు
లత్యంత దు
ర్వ్యత్తుల్ పువ్వులు పండ్లు
మన్మధముఖావిర్భూత దోషంబులుం
చిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీ
కాళహస్తీశ్వరా !
శంకరా ! మనస్సు లో పెరిగే
వేపచెట్టుకు ధన వ్యామోహమే పాదు . మనస్సులో
కలిగే ఆవేశ కావేశములే కంచె . అహంభావమే నీరు .
మనం ఆడే అబద్దాలే మొలకలు . చేసే
చెడు పనులే మారాకులు .
కామసంబంధమైన తప్పులే పూలు పండ్లు
కావున ఈ వృక్షాన్ని నా మనస్సులో నుండి తొలగించి జ్ఞాన వృక్షాన్ని నాటవలసింది స్వామీ !
నీపై గావ్యము జెప్పుచున్న యతడు న్నీపద్యముల్
వ్రాసి యి
మ్మా పాఠం బొనరింతునన్న యతడున్
,మంజుప్రబంధంబు ని
ష్టా పూర్తిం బఠియించుచున్న యతడున్
సద్భాంధవుల్ గాక ఛీ
ఛీ పృష్టాగత బాంధవంబు నిజమా శ్రీ
కాళహస్తీశ్వరా !
శంకరా ! నీ
యొక్క మాహాత్య్మాన్ని గురించి కావ్యము
వ్రాసేవారు , నిన్ను గురిచి పద్యాలు వ్రాసిస్తే పారాయణ చేసుకుంటానని కవులను అర్ధించేవారు , నీ యొక్క మనోహర ప్రబంధములను మధురముగా గానము చేయువారే నాకు బంధువులు కాని జన్మ సంబంధమైన
బంధువులు నాకు బంధువులు కారు .
సంపద్గర్వముఁ బాఱఁదోలి రిపులన్
జంకించి యాకాంక్షలన్
దంపుల్వెట్టి కళంకముల్నఱికి బంధక్లేశ దోషంబులం
జింపుల్చేసి , వయోవిలాసములు
సంక్షేపించి , భూతంబులం
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా ? శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీకాళహస్తీశ్వరా !
ఐశ్వర్యము వలన వచ్చిన గర్వాన్ని పారద్రోలి , అరిషడ్వర్గాలనే
అంతశ్శత్రువులను భయపెట్టి , కోరికలను పాతర వేసి, పాపములను అరికట్టి , స్వపర భావనాదులచే ఏర్పడ్డ తప్పులను
నశింపజేసి , వయస్సు వలన వచ్చు కామాది వికారములను నిగ్రహించుకొని , భవబంధములను
తెంచుకోనెడల నీ దర్శన భాగ్యము మాకు లభించదు కదా స్వామీ !
నిన్నం జూడరొ మొన్నఁజూడరొ జనుల్
నిత్యంబుఁజావంగ నా
పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి
న్విసర్జింప లే
కున్నారెన్నడు నిన్ను గందురిక
మర్త్యుల్ గొల్వరేమో నిను
న్విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ
కాళహస్తీశ్వరా !
పరమేశ్వరా ! మూర్ఖులైన ఈ జనులు తమ కళ్ళ ఎదుట
రోజూ జనం చచ్చిపోవడం చూస్తూనే ఉన్నారు . కాని ఆపదలో పెన్నిధానం వలే అనుకొని ఎన్నడు కూడ ధనం మీద వ్యామోహాన్ని
మాత్రం వదులు కోలేక పోతున్నారు. ఏ రోజు
ఇతర మోహాలను వదలి నిన్ను ఆశ్రయిస్తారో తెలియదు . ఇతర దేవతలను పూజిస్తూ నిన్ను చిన్నబుచ్చుతున్న
ఈ జనులు అవివేకులు .
రాజశ్రేణికి దాసులై ,సిరుల గోరంజేరగా
సౌఖ్యమో
ఈ జన్మంబు తరింపజేయగల మిమ్మే ప్రొద్దు
సేవించు ,ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో
మానవుల్పాపరా
జీ జాతాది మదాంధ బుద్దులగుచున్ శ్రీ
కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! ఈ
జనులు చేసిన పాపముల చేత ఈ భూమిపై పుట్టి
, మదాంధులైన ఈ నరులు అజ్ఞానము చేత
కప్పివేసి.రాజులకు దాస్యం చేస్తూ సంపదల నాశించడం సౌఖ్యమా ?
లేక మిమ్ములను సదా సేవించి కైవల్యాన్ని పొందడం సౌఖ్యమో?
తెలుసుకోలేక పోతున్నారు .
వన్నే ఏనుగు తోలు దుప్పటము ,బువ్వా
కాలకూటంబు , చే
గిన్నే బ్రహ్మ కపాలముగ్రమగు భోగే
కంఠహారంబు , మే
ల్నిన్నీలాగున నుంటయుం దెలిసియు న్నీ
పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుఁడెట్లు మానసమునన్ శ్రీ కాళహస్తీశ్వరా ! (90 )
శ్రీ శంకరా !
నీవు కట్టే బట్ట ఏనుగు చర్మము . తినే ఆహారము కాలకూట విషం. చేతిలోని గిన్నె
బ్రహ్మ కపాలము . కంఠాభరణాలు భయంకర
సర్పాలు మరి ఇవన్నీ తెలిసి కూడ
లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు నీ పాదపద్మాలను తన మనస్సు లో చేర్చి నిన్ను ఎలా పూజిస్తున్నాడు స్వామీ !
చదువుతూ.... ఉండండి . చివరి భాగం
త్వరలో
********************************************************************************
No comments:
Post a Comment