శతక సౌరభాలు - 3
మారన భాస్కర శతకము -2
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్
ఎట్టుగ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు ; నిబద్ధి
సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టుపెకల్చి పాల్కడలిఁ గవ్వము చేసి మధించి రంతయున్
వెట్టియె కాక యేమనుభవించిరి వారమృతంబు? భాస్కరా !
భాస్కరా ! ఎంతగా ప్రయత్నించినా కూడ దాన్ని అనుభవించే ప్రాప్తం
లేకపోతే ఆ ఫలితం మనకు దక్కదు. ఎలాగంటే దేవతలతో
కలిసి రాక్షసులు మందర పర్వతాన్ని
పెకలించి తెచ్చి దాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని మధించారు. వీరు పడిన శ్రమంతా వెట్టిచాకిరీ
అయిపోయింది కాని రాక్షసులు అమృతాన్ని ఒక్క చుక్క కూడ రుచి చూడలేక పోయారు గదా!
ఎడపక దుర్జనుం డొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే
యెడలను మేలు సేయడొక యించుక యైనను
జీడపుర్వు దా
జెడఁదిను నింతెకాక పుడిసెండు
జలంబిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటి నైన భాస్కరా !
భాస్కరా ! ఈ లోకం లో చెడ్డవాడు పరులకు ఎప్పుడు హాని చేయడానికి ప్రయత్నిస్తాడే కొంచెమైనా
ఉపకారం చెయ్యడు. ఏ విధంగా నంటే చీడపురుగు చక్కగా పూలు కాయలతో పెరుగుతున్న పచ్చని
చెట్టును సర్వనాశనం చేస్తుందే కాని దానికి ఒక పుడిసెడు నీళ్లు పోసి
పెరగడానికి దోహదం చెయ్యదు కదా !
ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నెన్ని దినంబులు గూడి యుండినన్
దొడ్డ గుణాఢ్యు నందుగల తోరపు వర్తన
లెల్లఁ బ్రజ్ఞ బే
ర్వడ్డవివేకరీతి; రుచి పాకము నాలుకగా కెఱుంగునే
తెడ్డది కూరలోఁ గలయ ద్రిమ్మరు
చుండిననైన భాస్కరా !
భాస్కరా ! మూర్ఖుడైన వాడు ఒక మంచివాని తో కలిసి
ఎన్నిరోజులు తిరిగినా ఆ మంచివాని లోని
గొప్పతనాన్ని ఏ మమాత్రం గ్రహించలేడు. ఎందుకంటే
కూర యొక్క రుచిని నాలుకకు తెలుస్తుంది గాని ఆ కూరను కలియపెట్టే తెడ్డు( గరిటె ) కు తెలియదు
కదా.
ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు
నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని
పిమ్మట రూపు మాయుఁగా
నిప్పున నంటియున్న యతి
నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన యట్టి బొగ్గునకుఁ దా
నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!
భాస్కరా !ఎప్పుడు అదృష్టము కలిసి వస్తుందో అప్పుడు జీవితం లో వెలుగు వస్తుంది. అది పోతే
చీకటే మిగులుతుంది. ఎలాగంటే నల్లగా ఉండే బొగ్గు
అగ్ని తో కూడి ఉన్నప్పుడు గొప్పగా ప్రకాశిస్తుంది. అగ్ని సంబంధము ఆరిపోతే పూర్వపు కాంతులు తగ్గి నలుపు రంగే కదా మిగిలేది.
ఏ గతిఁ బాటువడ్డ గలదే భువి
నల్పునకున్ సమగ్రతా
భోగము భాగ్యరేఖ గల పుణ్యునకుం బలె ; భూరి సత్వ సం
యోగ మదేభ కుంభ యుగళోత్థిత మాంసము
నక్కకూన కే
లాగు ఘటించు ?సింహము దలంచినఁ జేకుఱుఁ గాక ! భాస్కరా !
భాస్కరా ! ఈ భూమి మీద సంపూర్ణ సౌఖ్యము నందెడి భాగ్యరేఖ పుణ్యాత్మునకు లభించును గాని
అల్పునకు ఉండదు . ఎందుకంటే మదపు టేనుగు కుంభస్థలము నందుండెడి మాంసమును సింహము కోరుకున్న యెడల చేకూరును గాని నక్కపిల్ల ఎంత
ప్రయత్నించినను లాభము లేదు గదా !
ఏడ ననర్హుఁ డుండు నటకేగుఁ ననర్హుడు
నర్హుడున్నచో
జూడగఁ నొల్ల డెట్లన; నశుద్ధ గుణ స్థితి నీఁగ పూయముం
గూడిన పుండుపై నిలువ గోరిన యట్టులు
నిల్వనేర్చునే
సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపు
గస్తురి మీఁద భాస్కరా!
భాస్కరా ! ఒక అయోగ్యుడు ఎక్కడ అయోగ్యుడుంటే
అక్కడికే చేరతాడు గాని యోగ్యుడు ఉన్న చోటుకు వెళ్ళడు. ఈగ చీము పట్టిన పుండు మీద వాలుతుంది కాని
నుదుటి మీద పెట్టుకున్న కస్తూరి బొట్టు మీద వ్రాలదు కదా !
ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము
గల్గి యుండినన్
జాలు ననేక మార్గముల సన్నుతి కెక్క
నదెట్లొకో యనన్
ఱాలకు నేడ విద్యలు తిరంబుగ దేవర
రూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు
వెట్టరె మీద భాస్కరా !
భాస్కరా ! సమాజం లో ప్రసిద్ధి కెక్కాలంటే అదృష్టం కలిసి రావాలి గాని
ఎన్ని విద్యలు నేర్చుకుంటే మాత్రం ఏం ప్రయోజనం. ఎచ్చటనో ఉన్న బండరాళ్లు ఏ విద్యలు
నేర్చుకోక పోయినా వాటి అదృష్టంచేత దేవతా ప్రతిమలు
గా చెక్కబడగా ,జనం వాటికి పొర్లు దండాలు పెడుతూ , పూజలు చేస్తున్నారు కదా !
కట్టడ దప్పి తాము చెడుకార్యముఁ
జేయుచు నుండి రేనిఁ దో
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము ; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురుని తో నెడబాసి
విభీషణాఖ్యుఁ డా
పట్టున రాముఁజేరి చిరపట్టము
గట్టుకొనండె భాస్కరా !
భాస్కరా ! నీతి తప్పి ప్రవర్తించేవాడు తోడబుట్టినవాడైనా వదలి వేయాలనేది నీతి.
రావణాసురుడు మదం తో దుర్మార్గపు పనిచేస్తే అతని తమ్ముడైన విభీషణుడు అతన్ని
వదిలివేసి రామచంద్రుని చేరి , లంకానగరానికి రాజైనాడు కదా !
కట్టడయైన యట్టి నిజకర్మము చుట్టుచు
వచ్చి యేగతిం
బెట్టునొ పెట్టి నట్లనుభవింపక
తీరదు; కాళ్ళు మీదుగాఁ
గిట్టక వ్రేలుఁడంచుఁ దలక్రిందుగఁ
గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేరిన
కర్మము గాక భాస్కరా!
భాస్కరా ! జీవుడు విధి విహితమైన పురాకృత కర్మాన్ని
ననుసరించి వచ్చెడి ఎంతటి కష్ట నష్టాలనైనా అనుభవించక తీరదు. గబ్బిలాలు చూడండి . ఎవ్వరూ
తమని తలక్రిందుగా చెట్లకు కట్టకపోయినా
పూర్వ జన్మ కర్మ వలన అవి తల క్రిందులుగా వ్రేలాడుతూనే ఉంటాయి కదా !
కట్టడ లేని కాలమునఁ గాదు శుభం బొరులెంత వారు చే
పట్టిననైన మర్త్యునకు భాగ్యము
రాదను టెల్లఁ గల్ల,కా
దెట్టని పల్కినన్ ;దశరథేశ వశిష్టులు రామమూర్తికిన్
బట్టముగట్టగోరి రది పాయక చేకుఱె
నోటు భాస్కరా!
భాస్కరా ! మానవు లకు దైవానుగ్రహం
లేనికాలంలో మానవ ప్రయత్నం ఎంత చేసినా అది ఫలించదు. ఎందుకంటే దశరథమహారాజు , వసిష్టమహర్షి నిర్ణయించి
శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలని ఎంతో ప్రయత్నించారు. కాని దైవం వక్రించడంతో ఆ కార్యక్రమం జరగలేదు కదా !
కానక చేరబోలఁ డతి కర్ముడు నమ్మిక
లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయగ బోయిన
హానివచ్చు న
చ్చో నదియెట్లనం ; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగాఁ
బోనని కాన కాసవడి పోవుచుఁ గూలదెఁ
కొక్కు భాస్కరా !
భాస్కరా ! పందికొక్కు తనను చంపడానికి ఏర్పాటు చేసిన బోనులోని మేతను
చూసి ఆశ పడి వెళ్ళి,
అందులో చిక్కుకొని మరణిస్తోంది. అలాగే ఎన్ని నమ్మకాలను చూపించినా
దుర్మార్గుడి వద్దకు వెళ్లి స్నేహం చేస్తే హాని సంభవింస్తుది .
కాని ప్రయోజనంబు సమ గట్టదు తా భువి
నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు ; మహేశు పట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకుఁ దానె
గురుండు వినాయకుండుఁ దా
నేనుగు రీతి నుండియు నదేమిటి కాడడు
పెండ్లి భాస్కరా !
భాస్కరా ! ఈ భూమి మీద ఎంత విద్యావంతుడైన.
మహారాజు కుమారుడైన కూడ కాలం కలిసిరాకపోతే
కాని పని ఏ నాడు కాదు . ఎందుకంటే పరమేశ్వరుని కుమారుడు , సమస్త విద్యలకు నెలవు , సకల
విద్యలకు అధిపతి యైన వినాయకుడు ఏనుగంత బలవంతుడయ్యు ఎందుకు పెళ్ళి చేసుకోలేకపోయాడు. ?
కారణమైన కర్మములు కాక దిగంబడ
వెన్ని గొందులం
దూఱిన నెంతవారలకు ; దొల్లి పరీక్షితు శాపభీతుడై
వారధి నొప్పు నుప్పరిగపైఁ
బదిలంబుగఁ దాగి యుండినం
గ్రూర భుజంగ దంతహతి గూలఁడె లోకు
లెరుంగ భాస్కరా !
భాస్కరా ! అనుభవించాల్సిన కర్మ ను భూమి
పై అనుభవించాల్సిందే. ఎంతటి గొప్పవారైనా,
ఏ సందుల్లో, గొందుల్లో దూరి దాక్కున్నా, పూర్వ జన్మ కర్మలు పూర్తి గా
అనుభవించాల్సిందే. కాని ఏమీ మిగిలిపోవు. పూర్వము పరీక్షిన్మహారాజు శాప భయం చేత పారిపోయి , సముద్ర మధ్యంలో మేడ మీద
భద్రంగా దాక్కున్నా భయంకర కాలనాగు కాటుకు
బలై పోవడం లోకానికి తెలిసిన విషయమే కదా !
గిట్టుట కేడఁ గట్టడ లభించిన నచ్చటఁ
గాని యొండుచోఁ
బుట్టదు చావు ? జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁ గా
లగట్టిన శూద్రకున్ భ్రమలఁ గప్పుచు
దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మఱ్ఱి కడఁ బ్రాణముఁ దీసెగదయ్య భాస్కరా !
భాస్కరా ! మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా చావాలని రాసిపెట్టి ఉంటే అలానే చస్తాడు కాని తాను కోరుకున్న
చోటున జీవునకు మరణము సంభవించదు. ఎలాగంటే పూర్వము శూద్రక మహారాజు కాశీలో మరణిస్తే
ముక్తి కలుగుననే కోరికతో కాశీ కి చేరాడు. నడవడానికి వీలు లేకుండా మోకాలి చిప్పలు
తొలగించుకొని మరీ కూర్చున్నాడు. కాని
ఈశ్వర మాయ వలన ఒక గుఱ్ఱము అతన్ని
తీసుకెళ్ళి ,ఒక మఱ్ఱిచెట్టు కు ఢీ కొనడం మూలంగా ఆమహారాజు మరణించాడు. విధి విలాసమంటే
ఇదే నేమో !
ఘనుఁడగు నట్టివాడు
నిజకార్య సముద్ధరణార్ధమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్ధనఁ
చేయుట తప్పుగాదుగా ,
యనఘతఁ గృష్ణజన్మమున నా
వసుదేవుఁడు మీదుటెత్తుగా
గనుగొని గాలిగాని కడ కాళ్ళకు
మ్రొక్కడె నాడు భాస్కరా !
భాస్కరా ! గొప్పవాడు తన కార్యసాధనకోసం ఒక నీచుని ప్రార్ధించడం లో తప్పులేదు. ఫూర్వము
శ్రీ కృష్ణ భగవానుని జన్మసమయంలో ఆయన తండ్రియైన వసుదేవుడు కంసుని ఎత్తుకు పై
ఎత్తుగా గాడిద వెనుక కాళ్లకు నమస్కరించి తన పనిని నెరవేర్చుకున్నాడు గదా!
ఘనుడొక వేళఁ గీడ్పడిన గ్రమ్మఱ
నాతని లేమి బాపగా
గనుగొన నొక్క సత్ప్రభువు గాక
నరాధము లోపరెందఱుం;
బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున
మేఘుడు గాక నీటితోఁ
దనుప దుషారముల్ శతశతంబులు
చాలునటయ్య భాస్కరా!
భాస్కరా ! ఒక గొప్పవానికి కష్టాలు వస్తే వానిని
తీర్చడానికి ఒక మహారాజు కావలసిందే కాని
అల్పులకెందరకైననూ అది సాధ్యంకాదు. ఎందుకంటే పెద్దచెఱువు ఎండిపోతే తిరిగి దానిని నింపడానికి మేఘుడు వర్షించాలి కాని మంచుబిందువులు ఎన్ని కురిస్తే మాత్రం చెఱువు
నిండుతుంది.
చంద్ర కళావతంసు కృప చాలనినాడు
మహాత్ముడైనఁ దా
సాంద్ర విభూతిఁ బాసి యొక జాతి
విహీనునిఁ గొల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రి పద్మ మతి హీనత
నొందుట కాదుగా ; హరి
శ్చంద్రుడు వీరబాహుని నిజంబుగం
గొల్వడె నాడు భాస్కరా ! (40 )
యోగీంద్రుల చేత స్తుతించబడెడి పాదపద్మములు గల భాస్కరా ! ఈశ్వరానుగ్రహము చాలని రోజున ఎంత
మహానుభావుడైన సకల సంపదలను పోగొట్టుకొని
అల్పుల వద్ద సేవ చేయవలసిందే కదా. అలనాడు మహారాజైన హరిశ్చంద్రుడు కాలము కలిసి రాకయే కదా వీరబాహుని సేవించవలసి
వచ్చినది. తెలివి తక్కువతనం వలన కాదు గదా !
చక్కఁ దలంపఁగా విధి వశంబున నల్పుని చేతనైనఁ
దా
జిక్కి యవస్ధలం బొరలుఁ జెప్పగరాని మహాబలాఢ్యుడున్
మిక్కిలి సత్త్వసంపదల మీఱిన గంధగజంబు మావటీఁ
డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా !
భాస్కరా ! ఆలోచిస్తుంటే ఎంత బలవంతుడైన దైవయోగం లేకపోతే
బలహీనుని చేతిలో చిక్కి నానాకష్టాలు పడతాడనిపిస్తోంది. ఏ విధంగా నంటే మిక్కిలి
బలముగల గజరాజు సైతం మావటివాడెక్కి, అదిలించి , అంకుశం తో కొట్టి కూర్చోపెడుతుంటే సహిస్తోంది కదా !
చదువుతూ ...ఉండండి . మిగిలినవి త్వరలో........
*********************************************************************************
No comments:
Post a Comment