శతక
సౌరభాలు -2
ధూర్జటి శ్రీ
కాళహస్తీశ్వర శతకము - 5
భవదు:ఖంబులు రాజకీటకములనే బ్రార్ధించినన్ బాయునే
భవదంఘ్రి స్తుతి చేతగాక ,
విలసద్బాలక్షుధా క్లేశ దు
ష్ట విధుల్మానునె చూడ మేక చంటం దల్లి
కారుణ్య దృ
ష్టి విశేషంబుల నిచ్చు చంటి వలె శ్రీ
కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! జనన మరణాది సంసార దు:ఖములు నీ పాదపాద్మములను
సేవించుట చేత కాక రాజులనే కీటకములను సేవించుటచే సేవించుట వలన పోవునా .
ఎట్లనగా ఎదుగుచున్న శిశువు యొక్క ఆకలి
బాధ కరుణామృత హృదయముతో కన్నతల్లి ఇచ్చెడి చనుబాల తో తీరును కాని మేక మెడక్రింద చన్నుల వలన తీరదు కదా !
పవి పుష్బంబగు, నగ్ని మంచగు ,నకూపారంబు
భూమీస్ధలం
బవు ,శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ
నెన్నగా
నవనీ మండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా !
ఓ
శంకరా !
ఈ భూమి మీద అత్యంతమహిమ కల్గిన శివ
శివ అనెడి నీ నామస్మరణము చేయువానికి
వజ్రాయుధము పూలమాలగాను , అగ్ని గుండము మంచుకొండగను , సముద్రము భూ
ప్రదేశముగను , శత్రువు అతి మిత్రుడు గను , కాలకూట విషము దివ్యాహారము గను మారిపోవును . ఆలోచింప గా నీ నామము సర్వ
వశ్యకరమనుటలో సందేహమే లేదు.
లేవో
కానల కందమూలఫలముల్ లేవో గుహల్తోయముల్
లేవో యేరుల పల్లవాస్తరణముల్ లేవో సదా
యాత్మ లో
లేవో
నీవు విరక్తులన్మనుప జాలిం బొంది , భూపాలురన్
సేవల్సేయగ బోదురేలొకో జనులు ? శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా !
అడవులలో తినుటకు కందమూల ఫలాలు , నివసించ డానికి గుహలు ,సెలయేర్ల యందు నీరు , పత్రి మున్నగు పూజాద్రవ్యాలు ,
చిగురాకుల శయ్యలు లభించుచున్నవి కదా .
విరక్తులైన వారిని ఆదరించి కాపాడటానికి నీవు ఉన్నావు కదా . మరి ఈ మూర్ఖపు
ప్రజలు ఎందుకు రాజులను ఆశ్రయిస్తారో
తెలియడం లేదు .
మును
నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో మోహంబు చే నందు చే
సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో
చింతించినం గాని , యీ
జననం బేయని యున్నవాడ నిదియే చాలింపవే
నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ
కాళహస్తీశ్వరా !
ఓ శంకరా !
నేను ఇంతకు ముందు ఎన్ని జన్మలెత్తానో , ఆ జన్మల్లో అజ్ఞానం తో ఎన్ని పాపాలు
చేశానో తెలియదు . ఇప్పుడున్న ఈ జన్మయే
చివరిదని భావిస్తున్నాను . నిన్ను సేవించిన పుణ్యానికి నన్ను కరుణించి ఈ జన్మ నే
చివరి జన్మ గా చేసి నన్ను రక్షించవలసినది ప్రభూ. !
తనువెందాక ధరిత్రి నుండు నను నందాక
న్మహా రోగ దీ
పన దు:ఖాదుల బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుక న్నీపదపద్మము ల్దలచుచు న్విశ్వ
ప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండ జేయ గదవే ! శ్రీ కాళహస్తీశ్వరా !
ఓ ఈశ్వరా ! ఈ
భూమి మీద నేనెంత కాలం బ్రతికుంటానో అంతకాలం మహారోగాల మూలం గా కలిగే దుఖాలు లేకుండా దయతో చూసి , ఆపై ఇహలోక విషయాలను వదలి వేసి , నీ
పాదపద్మములను సేవించే భాగ్యాన్ని కల్గించు స్వామీ !
జలకంబుల్ రసముల్ ప్రసూననములు
వాచాబంధముల్ వాద్యము
ల్కల శబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తు
ల్మెఱుం
గులు నైవేద్యము , మాధురీ మహిమ గా
గొల్తు న్నినున్ భక్తి రం
జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా !
నేను నిన్ను నా
కవిత్వముచే పూజించెదను . కవిత్వమునందలి
రసములే అభిషేక జలం గా ,
వాక్కులే పూజా పుష్పాలు గా ,
అనుభూతి ప్రకటితమైన ధ్వనులే శంఖాది మంగళ
వాద్యాలు గా , సుప్రకాశమైన ఆకాశమే ఆభరణం గా , కావ్య గుణములే దీపాలు గా ,
కావ్యమందలి మాధుర్యమే మహర్నివేదన గా
దివ్యార్చన గురించి నేను నేర్చిన రీతిలో భక్తి తో నిన్ను
పూజిస్తాను ప్రభూ. !
ఏ లీల న్నుతియింపవచ్చు
నుపమోత్ర్పేక్షాధ్వని వ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ
రూపముం
చాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే
నిత్యంబు వర్ణించుచో ?
ఛీ ! లజ్జింపరు గాక మాదృశ కవుల్ ! శ్రీ కాళహస్తీశ్వరా
!
శ్రీ కాళహస్తీశ్వరా ! నీ రూపాన్ని వర్ణించడానికి ఉపమ ,ఉత్ప్రేక్ష ,ధ్వని , వ్యంగ్యము , శబ్ధ , అర్దాలంకారాలు , విశేష వ్యాకరణాదులకు కూడ అసాధ్యము . మరి ఎలా
నిన్ను వర్ణించగలను . అసలు నీ సత్యరూపాన్ని వర్ణించాలంటే కవిత్వం
నిలబడుతుందా ? నిలబడదు . కాని మా వంటి కవులు సిగ్గు లేకుండా నిన్ను వర్ణించాలని
చూస్తున్నారు . సిగ్గుచేటు. ఛీ ! ఛీ !.
పాలుం బువ్వయు బెట్టెదన్ గుడువరా
పాపన్న ,రాయన్న లే
లే లెమ్మన్న నరంటి పండ్లు గొని తే ,
లేకున్ననే నొల్ల నం
టే , లాలింపరె తల్లిదండ్రులపుడట్లే
తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలా వచనంబులం గుడుపరా ! శ్రీ కాళహస్తీశ్వరా
!
ఈశ్వరా ! తల్లిదండ్రులు తమ బిడ్డకు పాలబువ్వ పెడతాను తినరా ! నాయనా ! రా రా బాబూ ! అని బుజ్జగిస్తుంటే ఆ పిల్లవాడు నాకు అరటి పండ్లు కావాలి తెచ్చిన గాని తిననని మారాం చేస్తే , ఆ బిడ్డకు అరటి పండ్లు తెచ్చి తినిపింతురు
కదా ! అట్లే నీవు నాకు ప్రేమ తో నిండిన ముద్దు మాటలతో
అన్నము తినిపించవలసినది స్వామీ !
ఈ పద్యం లో కవియొక్క ఆత్మ నివేదన తుది దశకు చేరింది. కన్నబిడ్డ లా
తనను ఓదార్చి , దగ్గరకు తీసుకొని అన్నం
తినపించమని తన దైవాన్ని కోరుకుంటున్నాడు .
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు
సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు
న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం
బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా !
రెప్పపాటు లో మరణించే ఈ జీవుల యొక్క జీవితాల లో మమకారాన్ని పుట్టించి , కలలనీ , శకునాలనీ , గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు , దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ ఎన్ని ఆపదలను సృష్టించావు స్వామీ !
తలమీద కుసుమ ప్రసాద మలిక స్ధానంబు పై
భూతియున్
గళ సీమంబున దండనాసిక తుదన్గంధ
ప్రసారంబు ,లో
పల నైవేద్యంబు జేర్చు నే మనుజుడా
భక్తుండు నీ కెప్పుడున్
జెలికాడై విహరించు రౌప్యగిరి పై ; శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా
! ఏ పురుషుడు నిత్యము నీ నిర్మాల్యమును తలపై ధరించుచూ
, నుదుటి పై విభూతిని , మెడలో రుద్రాక్షలను
ధరించి , నీ పూజాపుష్పాల నిర్మాల్యాన్ని ఆఘ్రాణిస్తూ , నీ నైవేద్యం తో
కడుపు నింపుకుంటాడో ఆ భక్తుడు ఎల్లవేళలా నీకు చెలికాడై , వెండికొండ మీద విహరించ గలుగుతాడు .
ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు
నిష్టార్థంబు లీ నేర్తురే
వేళన్వారి భజింప జాలిపడకావిర్భూత
మోదంబునన్
కాలం బెల్ల సుఖంబు నీకు , నిక
భక్తశ్రేణి రక్షింపకే
శ్రీ లెవ్వారికి కూడబెట్టెదవయా ? శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! భార్యాబిడ్డలు ,మిత్రులు , అనువారు ఎల్లవేళల
వారి స్తోత్రము చేసినను కోరిన కోరికలు
తీర్చలేరు కదా ! నీవు ఎల్లవేళలా ఆనందమయుడవై మా వంటి వారిపై జాలి
చూపకున్నావు . నీ
భక్తులను కాపాడకుండా సంపదలు ఎవ్వరికోసం
కూడబెడుతున్నావు స్వామీ.!
గతి నీవంచు భజించు వార లపవర్గం
బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ? “ యాయురన్నం ప్రయ
చ్ఛతి “ యంచు న్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధ కారాభి దూ
షిత దుర్మార్గులు గాన గానబడవో ? శ్రీ కాళహస్తీశ్వరా
! ( 60 )
శ్రీ శంకరా ! నీవే దిక్కని సేవించిన వారు మోక్షాన్ని పొందుచుండగా , ఎల్లప్పుడూ కూటికై పాకులాడుచూ , సంసారమనే
మోహంలో పడి కొట్టుకుపోయే వారు “ఆయుష్షు ఉన్నవారికే అన్నం లభిస్తుందని “ శ్రుతులు
చెప్పిన మాట వినలేదా ? లేక వారికి వినబడదా ?
చదువుతూ ...
ఉండండి . మరికొన్ని అందిస్తాను మరి .......
*********************************************************************************
No comments:
Post a Comment