శతక సౌరభాలు – 1
కంచర్లగోపన్న దాశరథీశతకము
- 2
శ్రీ
రమణీయహార ! అతసీకుసుమాభ శరీర ! భక్త మం
దార ! వికారదూర ! పరతత్త్వవిహార ! త్రిలోకచేతనో
ద్ధార ! దురంతపాతకవితానవిదూర ! ఖరాదిదైత్య కాం
తార కుఠార ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !
శ్రీరామా ! శ్రీకరమైన రమణీయమైన హారములు ధరించినవాడా
! అవిశెపూవు వలె అతి సుకుమారమైన శరీరము కలవాడా ! భక్తుల పాలిట కల్పవృక్షము వంటివాడా ! పరబ్రహ్మ వై
ముల్లోకములను తరింపచేయువాడా ! అంతులేని పాతకములను
పోగొట్టువాడా ! ఖరుడు మొదలైన రాక్షసులనెడి అడవి పాలిట
గొడ్డలి వంటివాడా !
దురితలతాలవిత్ర ! ఖరదూషణ కానన వీతిహోత్ర ! భూ
భరణ
కళావిచిత్ర ! భవబంధవిమోచన సూత్ర ! చారు వి
స్ఫురదరవింద నేత్ర ! ఘనపుణ్యచరిత్ర !
వినీల భూరికం
ధరసమగాత్ర ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !
శ్రీ రామచంద్రా!
నీవు పాపములనెడి తీగల పాలిట కొడవలి వంటి వాడవు. ఖర దూషణులనెడి అడవి పాలిట కార్చిచ్చు వంటి వాడవు. భూభరణ సమర్థుడవు. సంసార బంధ విమోచన
మర్మజ్ఞుడవు. వికసించిన
తామరల వంటి నేత్రములు కలవాడవు . ఘనమైన చరిత్ర కలవాడవు. నీలమేఘశ్యాముడవు .ఓరామా నీ
గొప్పతనమేమని వర్ణించగలను.
కనకవిశాలచేల ! భవకానన శాతకుఠారధార ! స
జ్జన
పరిపాలశీల ! దివిజస్తుత సద్గుణ కాండ ! కాండ సం
జనిత
పరాక్రమ క్రమ విశారద ! శారద చంద్ర కుంద చం
దన
ఘనసారసార యశ ! దాశరథీ !
కరుణాపయోనిథీ !
ఓజానకీజానీ ! కనకమయ వస్త్రమును దాల్చిన వాడవు.
సంసారమనెడి అరణ్యమునకు గొడ్డలి వంటి వాడవు.
మంచివారిని కాపాడటమే వ్రతముగా కలవాడవు.దేవతలచే పొగడబడిన సద్గుణములు
కలవాడవు. ధనుర్విద్యా పారంగతుడవు. శరత్కాల
చంద్రుని , మరుమల్లెలను, మంచిగంధమును ,
పచ్చకర్పూరమును పోలిన సునిర్మల కీర్తి కలవాడవు .
దారుణ పాతకాబ్దికి సదా బడబాగ్ని, భవాకులార్తి వి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి ,దురంతదుర్మతా
చార
భయంకరాటడవికిఁ జండకఠోర కుఠార ధార , నీ
తారకనామ
మెన్నుకొన దాశరథీ ! కరుణాపయోనిథీ !
ఓ రామచంద్రా ! భవసాగరమును తరింపచేసెడి రామ అనెడి
నీ తారక నామము ఆలోచింపగా , పాపమనెడి భయంకర సముద్రమునకు బడబాగ్ని వంటిది. సంసారబాధలనెడి కార్చిచ్చును
అణచివేసెడి అమృతవర్షము వంటిది.
దుర్మతాచారములనెడి భయంకరమైన అరణ్యమును ఖండించివేయు వాడియైన గొడ్డలి వాదర
వంటిది.
హరునకు
నవ్విభీషణునకద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికినహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు
చుట్టమై
పరగిన
యట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరం
తరము
నటింప జేయుమిక దాశరథీ ! కరుణాపయోనిథీ !
శ్రీ దాశరథీ !
శివునకు , ఆ విభీషణునకు , పార్వతీదేవికి పవిత్ర మంత్రమై , గజేంద్రునికి
,అహల్యకు , ద్రౌపదికి దు:ఖములను హరించు చుట్టమై , ప్రకాశించిన
నీ పతిత పావన నామము నా నాలుక పై
ఎల్లవేళల నటించుచుండునట్లు చేయుము.
ముప్పున
గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
తప్పక
చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !
ఓ రామచంద్రా ! ముసలితనము లో యమభటులు సమీపించి నప్పుడు , రోగములు
పెరిగి పోయి కఫము గొంతులో నిండిపోయి
మాటరానప్పుడు , చుట్టాలు చుట్టు కమ్ముకొన్నప్పుడు , నేను మీ స్మరణ చేయగలనో లేదో కావున ఇప్పుడే మీ భజన చేసెదను .
కొందరు
దురదృష్టవంతులకు కష్టాలు కమ్ముకున్నప్పుడు
ఆ భగవంతుడు గుర్తుకు రాడు. తరువాత బాధ పడతాడు. తన స్వామిని ఎందుకు వేడుకోలేక
పోయానని . దానినే పూర్వజన్మ జ్ఞాన సంపత్తి అన్నారు పెద్దలు. అందుకే ఆ సమయం వరకు
ఎదురు చూడకుండా ఇప్పుడే తారకనామాన్ని
భజిస్తానంటున్నాడు రామదాసు.
“ పరమదయానిధే ! పతితపావననామ హరే “ యటంచును
స్థిరమతులై
సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమున
దాల్తు మీరటకుఁజేరకుడంచు యముండు కింకరో
త్కరమున
కాన పెట్టునట దాశరథీ ! కరుణాపయోనిథీ !
ఓరామా!
“పరమ దయానిధే
పరమ పావననామ హరే “అంటూ ఎల్లప్పుడు నీ నామ స్మరణ చేయు మహాత్ముల
పాదధూళిని నేను తలపై ధరిస్తాను. ఎందుకంటే
రామభక్తుల వద్దకు వెళ్లవద్దని యముడు తన
భటులను ఆజ్ఞాపించునట కదా స్వామీ !.
చదువుతూ ఉండండి .........................మరికొన్ని అందిస్తాను.
********************************************************************************
చదువుతూ ఉండండి .........................మరికొన్ని అందిస్తాను.
********************************************************************************
No comments:
Post a Comment