శ్రీ రామ కావ్యామృతం -1
శ్రీ
రామచంద్రుని కధే ఒక గొప్ప కావ్యం. అది
వ్రాయడానికి ప్రయత్నించిన ప్రతి కవి
మహాకవి అయిపోవడం లో ఆశ్చర్య మేముంది! అంటాడు హిందీకవి
మైథిలీ.
తెలుగు
లో ఎందరో రామనామ మర్మజ్ఞులైన భక్త కవులు ఎందరో రామకధను మహాకావ్యాలుగా,లఘుకావ్యాలుగా ఖండకావ్యాలు గా
తమకు నచ్చిన మెచ్చిన వచ్చిన రీతిలో గానం చేసి,
శ్రీరామ నామా మృత పానంతో ధన్యాత్ములయ్యారు. వానిలో లఘుకావ్యాలలో అమృత గుళికల వంటి కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం ఆశించని వాటిని రసజ్ఞులైన రామభక్తులతో కలసి పంచు కోవడమే ఈ శీర్షిక లక్ష్యం .
రారా! రాఘవరామా!
రారా! సురవినుత
నామ రాక్షసభీమా!
రారా !రవికుల సోమా!
రారా
! సాకేతధామ! రారా! రామా!
రామా! రామా ! రామా!
రామా !శ్రీరామ రామ
రామా! రామా!
రామా! రామా! రామా! రామా! శ్రీరామ రామ
రామా! యనుచున్.
నల్లవాడ నాదు యుల్లంబు లోనికి
మెల్లగాను వచ్చి యెల్లకాల
ముల్లసిల్లుమయ్య.కల్లగాదిది వేగఁ
జల్లనైన కృపను జల్లుమయ్య.
వచ్చుచున్నాను దేవరా! వచ్చుచుంటి
నాదు వెంటనె
నిన్వీడి నిముసమైన
బ్రతకజాలను
రాఘవా! బ్రతకజాల
నన్ను నీలోన
చేర్చుకో నల్లనయ్య.
రామా! ఘననీరద వ
త్శ్యామా! రఘురామ ! భక్తసన్నుత
ధామా !
నీ మాయ తెలియవశమా!
కామారి స్తుత్యనామ! ఘనతర ధామా !
రామ నామంబు పేరిట
రత్నమెపుడు
చీర కొంగున
ముడివైచి, చేరనీకు
నెవరినింగాని
ప్రక్కకు నెపుడు కూడ
దాని
జూపింపకమ్మ యందరకు నీవు.
మనము
నిర్మలమయినంత మమతలుడుగు
గలుగు నేకాగ్ర
బుద్ధియు, గాంచెదీవు ,జ్ఞానరత్నంబు.......
కావ్యము:--- శబరి. ముద్రణ:-- 1956 రచయిత్రి :--- శ్రీమతి భోగరాజు
చిట్టెమ్మ తల్లిదండ్రులు :- లక్ష్మీదేవి,లక్ష్మీనరసింహం జన్మస్ధలం:--- పూళ్ల . ప.గో
జిల్లా . జననతేది :- 18.10.1919. *****************.********************************
No comments:
Post a Comment