Friday, 25 May 2012

మఱలనిదేల రామాయణంబు



                    
                   

                                     మఱల నిదేల రామాయణంబు



       




                              శ్రీ రామచంద్రుడు ఆదర్శపురుషుడు.శ్రీ రామకధ విశ్వవ్యాప్తమైన మధుర కధాఝరి.రామాయణంలోని పాత్రలు నేటిసమాజం లో కన్పించే అనేకపాత్రలకు ప్రతిరూపాలే..తండ్రిమాట దాటని కుమారుడు,అన్న అడుగుజాడల్లో నడిచే తమ్ముడు,భర్తను అనుసరించే ఇల్లాలు, అన్నకేసం రాజ్యాన్ని గడ్డిపోచగా వదిలేసే తమ్ముళ్లు,ఉమ్మడికుటుంబాల్లో వైరాలు సృష్ఠించే పనిగత్తెలు,ప్రభువుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడే సేవకులు, ఆడదానికోసం ఎన్నిఅఘాయిత్యలైనా చేయడానికి సిద్ధపడే కాముకులు,---ఇలా ఒకరేమిటి రామాయణంలో అన్నిపాత్రలు లోకంలో కన్పించేవే.అందుకే విశ్వజనానీకానికి రామాయణం పారాయణ గ్రంధమైంది.రామాయణంలో కన్పించే పాత్రలు సమాజంలోనివేనని చూపి, రాబోయేతరం అటువంటిపాత్రల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పడమే ఆదికవి లక్ష్యం .అందుకే ఉపదేశమనేది  కావ్యప్రయోజనాల్లో ఒకటిగా కావ్యప్రకాశంలో చెప్పబడింది.
                       

           ప్రధాన రహదారుల్లో ప్రమాదహెచ్చరికసూచికలను నిలిపి ప్రయాణీకులను హెచ్చరించినట్లుమహాకావ్యాల్లో కొన్ని కొన్నిపాత్రలను సృష్ఠించిన మహాకవులు ఇటువంటి పాత్రలవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సమాజానికి సందేశమిస్తారు.అట్టి ఉత్తమోత్తమకావ్యం కాబట్టే రామాయణం యుగాలు గడిచినా,తరాలు మారినా నిత్యనూతనంగా ప్రకాశిస్తోంది. తలమానికంగా చెప్పబడుతున్న వివాహవ్యవస్ధ,
ఏకపత్నీత్వం, ఉమ్మడికుటుంబజీవనం వంటి సంప్రదాయాలకు ఆశ్చర్యపోయిన విశ్వమానవాళి రామాయణాన్ని ఆదర్శగ్రంధంగా భావించి ఆదరిస్తోంది కాబట్టే దేశపుటెల్లలుదాటి పొరుగుదేశాల్లో సైతం రామకధ పలుపోకడలు పోతోంది. 
           
    వేలాది మందికవులు వందలసంవత్సరాలనుండి రామాయణాల్ని వ్రాస్తూనేఉన్నారు.వ్రాస్తున్నారు.వ్రాస్తారు కూడా. అందుకే  “రామకధే ఒకమహాకావ్యం.దాన్నివ్రాసిన ప్రతివాడు మహాకవి అవుతున్నాడు అన్ననానుడి ఏర్పడింది.
                   

                 రామచంద్రుణ్ణి ఆదర్శపరిపాలకునిగా భావించి,పూజించి ,రాజ్యాలను స్ధాపించి పాలించిన మహారాజులెందరో సీతారాములపట్టాభిషేకాన్ని,యుద్ధసన్నాహాలను చూపే అద్భుతదృశ్యాలను బంగారు,వెండినాణేలపై ముద్రించి రామచంద్రునిపై తమకున్నఆరాధనాభావాన్ని ప్రకటించుకున్నారు.అటువంటి అపురూపనాణేలు రెండు నాకు లబించాయి.ఒకటి బంగారు నాణెం.ఇది ఒక ముస్లింమిత్రుని వద్ద ఉన్నది. రెండవది భద్రాచలంవద్ద గోదావరి ఇసుకలో లభించింది.
                                              
                 ఈసారి వాటిని గూర్చి తెలుసుకుందాం !
       

No comments: