Sunday, 28 December 2014

బాపు గీసిన “ నా ” రాముడు

                 


  బాపు గీసిన   నా రాముడు     
                         
                  
                        అది 1995 సంవత్సరం. అప్పటికి నా పిహెచ్. డి పూర్తయ్యి మూడేండ్లు అయ్యింది. 1986 లో  పరిశోధన మొదలుపెడితే  1992 లో అవార్డు అయ్యింది. తరువాత దాని ముద్రణ ఒక సమస్య. రామాయణ లఘుకావ్య రామణీయకము అనే అంశంపై ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గారి పర్యవేక్షణ లో నాగార్జున విశ్వవిద్యాలయం లో నా పరిశోధన సాగింది.   పిహెచ్.డి చేయాలనేది ఒక కోరికైతే  అది పూర్తయిన తరువాత దాన్ని అచ్చులో చూసుకోవాలనేది మరో కోరిక. కోరికలకు అంతు ఉండదు గదా. సుమారు ఆరువందల పేజీల పై చిలుకు పుస్తకాన్ని (అనుబంధం, ఫోటోలు కాకుండా ) అచ్చు వేయడమంటే మాటలు కాదు గదా.  ఆ సమయం లోను  ఆ ఆపద మొక్కులవాడు    శ్రీ తిరువేంకటాథీశుడు గుర్తుకొచ్చాడు. ఆయనకొక విన్నపాన్ని పంపించుకున్నాను. కాలం గడిచి ఆ విన్నపం ఫలితావస్థకు రావడానికి మూడేళ్లు పట్టింది .
                                  1995 లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆథ్యాత్మిక గ్రంధ ప్రచురణ లకు అందించే ఆర్థిక సహాయం నా గ్రంథానికి కూడ   ప్రకటించడం తో టైపు లో ఉన్న నా  పరిశోథనా గ్రంథం ముద్రణాలయం మెట్లు ఎక్కింది. ఆ సమయం లో ముద్రణ కు ఇంకా ఎంత డబ్బు కావాల్సొస్తుందని  అనే ఆలోచనలో ఉండగానే అదే అవుతుందిలే బావా అంటూ భుజం తట్టి నన్ను , నా పుస్తకాన్ని తీసుకెళ్లి వాణి ప్రెస్ అథినేత శ్రీమాన్  రంగాచార్యుల వారికి  పరిచయం చేసిన ఆప్తుడు  ఆ.. నాటి వరకు నాకు అన్నీ తానే అయిన వాడు.  అందుకే అందరినీ వదిలి అందని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ ఆత్మీయుడే డా.అగ్నిహోత్రం యోగానంద నరసింహాచార్యులు గారు. ఈయన విజయవాడ శారదా కళాశాల  లో తెలుగుశాఖా నిర్వాహకుడుగా ఉండేవారు.
                      సరే ! పుస్తకం  తయారవుతోంది . ముఖచిత్రం మాట ఏమిటి ?  అనే ప్రశ్న వచ్చింది. నాలోని కోరికను బయటపెట్టాను.  రామకథకు ,వాల్మీకి మహర్షి కి ఎంతటి అవినాభావ సంబంధముందో , ఆధునిక యుగం లో రామాయణ కధ కు బాపు కు  అటువంటి సంబంధమే ఉందనేది నా భావన.  అందుకే  నా పరిశోధనా గ్రంథం పైన  బాపు   ముఖ చిత్రం కావాలి అడిగాను. అది సాథ్యమా ? కాదా ?   అనేది తరువాత సంగతి. సరే! ప్రెస్ ద్వారా  శ్రీ రంగాచార్యులు గారు ప్రయత్నం ప్రారంభించారు. నేను కూడ నా synopsis  copy  ని జత చేసి ఒక అభ్యర్థనను బాపు చెంతకు పంపించుకున్నాను. ఇంకా వేరే మార్గాలేమైనా ఉంటాయేమో నాకు తెలియదు. నాకు తెలిసిన మార్గం అదొక్కటే . ముద్రణ పూర్తవుతోంది .బాపు వద్ద నుండి సమాధానం రాలేదు అనుకొంటుండగా, వాణీప్రెస్ అధినేత నాకు ఫోన్ చేశారు. విషయ సారాంశం ఇది. బాపు  ఏదో సినిమా  నిర్మాణం లో బిజీ గా ఉన్నారట. ఇప్పుడు టైటిల్ వేయడానికి కుదరదని  చెప్పారట.
                            నిరాశే కలిగింది. సరే !  పరిశోధనావ్యాసం  సమర్పించిన తరువాత అవార్డు అవడానికే సంవత్సరం పైన పట్టింది . టైటిల్ పేజీ కోసం ఇంకో సంవత్సరం ఎదురు చూస్తాలెండి. బాపు బొమ్మ లేకుండా  పుస్తకం బయటికి రాదు   అనుకున్నాను .
                              మరి కొంత కాలం గడిచింది.  ఆ రోజు సమయం పదకొండు దాటుతోంది. విజయవాడ నుండి మా కాలేజి ప్రిన్సిపాల్ గారి ఆఫీసుకు ఫోను . ఆ రోజుల్లో ల్యాండు లైన్ లు మాత్రమే ఉండేవి గదా.  పిలుపొచ్చింది . వెళ్లాను. వాణిప్రెస్ అథినేత రంగాచార్యులు గారు మాట్లాడారు. శ్రీ బాపు  నా పుస్తకానికి టైటిల్ వేసి ప్రెస్సు కి పంపించారట.   ఎంత ఆనందమేసిందో చెప్పలేను . డాక్టరేట్ అవార్డు అయ్యిందానికన్నా ఎక్కువ ఆనందాన్ని పొందాను. ఆ రాముడు ఇదిగో.
                       



                            బాపు ని అభిమానించే కోట్లాది మంది లో నేను కూడ ఒకణ్ణి. అది  తలుచుకున్నప్పుడల్లా నాకెంతో గర్వంగా  అనిపిస్తుంది.  నేను చేసిన పరిశోధన ఒక ఎత్తు కాగా ఆ గ్రంథానికి బాపు వేసిన ముఖచిత్రం ఒక ఎత్తు.  నా గ్రంథానికి అంతర్జాతీయ  గుర్తింపు  వచ్చి , AmazOn.co వంటి సంస్థ  నా గ్రంథాన్నిమార్కెట్ లోకి పరిచయం చేయడం  , అలాగే ప్రపంచంలోని 5మిలియన్ల  విమర్శకులలో నా పేరు కూడ ఉండటం అనేవి నా పరిశోధన తో పాటు  బాపు వేసిన ముఖచిత్రం కూడ కారణ మని  నేను భావిస్తున్నాను .అందుకే బాపు ని గురించి   ఈ రెండు మాటలు చెప్పకపోతే నా మనసు  ఊరుకోవడం లేదు.      ఆ మహా మహుని ఆత్మ కు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ , సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రామచంద్రుడు  ఎల్లరకు సుఖశాంతులను కల్గించాలని   ప్రార్ధిస్తున్నాను.
                   ఈ అనుబంధం లో క్రింద నుంచి 6 వ వరుస లో  చూడండి. మరిన్ని వివరాలకు   mutteviraviprasad.blogspot.com   ను సందర్శించవచ్చు .                                                                                                                          - Published by Data Researchers Network
tions? Authors
Customers  - 
"M"
Explore Authors
"M"
Are you looking for a specific author, author biography, books or quotes by your interested author? Explore one of the largest online databases of authors with over 5 million unique entries and find your favorite author. Get valuable knowledge that will be helpful when preparing your ownessayterm paperdissertationthesisbook report or research paper. Our authors database is meant to assist every student in finding quality material on a particular author and be always prepared for a class.
Browse the index of authors and choose the author you wish to explore below or use an alphabetical directory (A-Z).
Browse Authors:
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
(Click a letter to view the authors)
Monty. HallMary Wollstonecraft Shelley, Edgar Allen Poe, Fitz-James O'Brien, Jules Verne, Edward Everett Hale, Frank Reade Jr., H.G. Wells, M.P. Shiel, Arthur Conan Doyle, Edgar Rice Burroughs, A. Merritt, Karel Editor- Sam Moskowitz (Stories by Cyrano de BergeracMarnie AndersonMiriam Look MacMillanMichele PierreMarcia Tremmel GoldsteinMandy WhartonMagda KhanMimi KirkMari Lu MartensMargaret Overholt SaundersMary Alison HancockMarilyn Alendal HultMaggie KnippMary MacEachern BairdMrs HendrieMaysoon SamourMembers of the Woman's Club Key WestMary Allen WestMary Woody HermanMoebius, Rick Geary Jean-Michel CharlierMargaret F BuckMary Ann BambergerM.G. ReedM GehrtsMarci & Pronzini, Bill MullerMary Beth WertimeMargarita KayMargaret H. KiloMary E JohnM. Montagu-MarsdenMary Elisabeth OakeMerle SavageMarlies GruningM.H. RubinsteinMaria WeigleMarianne FeuersengerMitali ChatterjeeMaria Isabel CasasMama Doumbia KoiteMattie RoigMary Rakestraw JonesMrs. J. T.; Curlett, Mrs. John; Newbill, Mrs. Sidney; Ellis, Mrs. George HoskinsMary Ellis (editor) WoodringMabel BurlinghamMarjorie MartorellaMartha E WileyMary Louisa McRoberts BlackMonica A PayneM.D. John M. Ellis
M.A. John McTaggart Ellis McTaggartMyles RyderMartin I HorowitzMartin I. HorowitzMartin I. & Pigman, Ward (Editors) HorowitzMarco Guarnaschelli & Bastianich, Lidia . GottiMarco Guarnaschelli GottiMurderers Cspoly 542258Music & Lyrics by Stephen SondheimMark Eden/ Sondheim, Stephen HorowitzMerley SecrestMiyazawa / Translated by Kenji Okuhira & Gerald Hausman KenjiMaggie/ Jencks, Charles/ Hardie, Alison KeswickMaggie. KeswickMarjorie Daum ColumbusMargaret Sharkey WelchMary Catherine RomerMicheal Gonzalez SchmokerMichael BarbettaMary Catherine GroveMartha Catherine Cull GilkeyMalcolm RubelMary Catherine Wayne WhitneyM. ReederMrs. General Booth [Catherine Mumford Booth] (1829-1890)M. JelinekManuel and Catherine L. SalasM. CarreteroMariko KatoMarcia Martínez CarvajalM. Schmitter-EdgecombeMartin Van MesdagMichael J MerkinMaj. Dennis R WEDDLEMichael). (HEFFERNANmOEjMarjorie E. AlcockMelissa A. BowlesM RothblattMargaret; Cantrell, Raine; Harrington, Alexis; Rich, Sue BrownleyMonalisa MohantyMika BurleyMorris WiliamMoses, Ph.D. AdetumbiMirjam FuruhjelmMcClure Matthew ThompsonMaureen Junker-KennyMargo Swedlund RussellMonique; Thuillier, Jacques (preface) Le Pelley FontenyMichael Ruge
Margaret MatchesMargaret. TrudeauMs. Sarah HortonM. KrijnMargaret C. EggoMark AvelineMargot C. HoweMichael PinkusMaxine WhittakerMr Ian McDermottMonica(Editor) ; Garcia-Preto, Nydia(Editor); Giordano, Joe(Editor) McGoldrickMarcia RosalMarie Donaghy PhD BA(Hons) FCSP FHEAMartha A. GabrielMary WillmuthMartin J. LaraMaxine B. JungeMichael Friedman MDMartin A TullerMD Keiichi MorishitaMurray (ed.) GoldsteinMonika Nvcker-RibaupierreMichael L. FreeMark A. Brimer PhD PTM. von ArdenneMuru. Pala Irattinam CettiyarMakhanalal RayacaudhuriMarcos RamayanaMahesvara DasaMoraribapuMilena SalviniMani SahuMuttevi RaviprasadMichael Madhusudan DattaMilly AcharyaMagazine Corp.Mahavir Prasad JosiMuktesvaraMulakh Raj JainMalati Candulal NayakMilan DattaMadhusudan Madhavlal PathakMahavir AgravalManjula SahadevaM.A. Sunardjo HaditjarokoMechai ThongthepMathuram, Illustrated by Baniprosonno BhoothalingamMelanie RandolphMrs Bruin (edit).

 ****************************************************************************

No comments: